నందమూరి, నాని కాంబో..!

kalyan ram plan to movie with nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోలు ఎవరు అంటే ముందు వరుసలో నాని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు వరుసగా 7 విజయాలను సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో ‘ఎంసీఏ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యింది. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నాడు. మరో వైపు ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. అది వచ్చే సంవత్సరం ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా నాని కమిట్‌ అయ్యాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నాని హీరోగా ఒక సినిమాను కళ్యాణ్‌ రామ్‌ నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. నాని డేట్స్‌ను తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం కథ మరియు దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. త్వరలోనే కథ మరియు దర్శకుడిని ఫైనల్‌ చేసి నానితో స్క్రిప్ట్‌కు ఓకే చెప్పించబోతున్నాడు. ‘ఎంసీఏ’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత అంటే డిసెంబర్‌లో నందమూరి నిర్మాణంలో నాని కొత్త సినిమా ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. నానితో సినిమాకు కళ్యాణ్‌ రామ్‌ భారీ పారితోషికాన్ని ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నానికి భారీ క్రేజ్‌ ఉంది. అందుకే కళ్యాణ్‌ రామ్‌ ఆయనతో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపుతూ స్వయంగా డేట్స్‌ను అడిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటిస్తూనే ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు

జైలవకుశ ఆడియో, రిలీజ్ డేట్స్ వచ్చేసాయి.

సినిమాల్లోకి రాకముందే ఆ హీరోయిన్ తో చరణ్…సెన్షేషనల్ వీడియో.

బాబాయ్, అబ్బాయి లాభాలు చూస్తున్నారు.