ముమైత్‌ ఆట పూర్తయ్యింది

mumaith khan leaves big boss telugu house

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముమైత్‌ ఖాన్‌ సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యేందుకు హైదరాబాద్‌కు చేరుకుంది. సిట్‌ అధికారులు ముమైత్‌ ఖాన్‌కు నోటీసులు ఇచ్చిన సమయంలో ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంది. దాంతో ఆమె ఎలా హాజరు అవుతుంది, అసలు హాజరు అవుతుంది, బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆమెను పంపిస్తారా అనే అంశాలు నిన్నటి వరకు చర్చ జరిగింది. ముమైత్‌ ఖాన్‌ హాజరు కాబోతుంది అని ప్రకటన వచ్చిన తర్వాత ఆమెకు బిగ్‌బాస్‌ రెండు రోజులు పర్మీషన్‌ ఇచ్చాడని, ఆమె విచారణ ఎదుర్కొని మళ్లీ ఇంట్లో చేరుతుందని అంతా భావించారు. హిందీ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో ఒక హౌస్‌మెంట్‌ కోర్టు వ్యవహారాన్ని చూసుకుని మళ్లీ తిరిగి ఇంట్లో జాయిన్‌ అయ్యాడు. 

తెలుగులో మాత్రం ముమైత్‌ ఖాన్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. నేడు ప్రసారం అవ్వబోతున్న ఎపిసోడ్‌లో ముమైత్‌ ఖాన్‌ను ఎలిమినేట్‌ చేయబోతున్నారు. ముమైత్‌ ఖాన్‌ మళ్లీ షోలో జాయిన్‌ అవ్వడం అసాధ్యం. షో ఆరంభం అయినప్పటి నుండి ముమైత్‌ ఖాన్‌ అందరి ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ప్రతి ఒక్కరితో జోవియల్‌గా ఉంటూ అందరిని కలుపుకుంటూ వెళ్తుంది. ఇంతకు ముందు ముమైత్‌ ఖాన్‌ అంటే ఒక అభిప్రాయం ఉండేది. కాని బిగ్‌బాస్‌ షోలో ముమైత్‌ను చూసిన తర్వాత అంతా ఆమెపై మంచి అభిప్రాయంకు వచ్చారు. దాంతో ముమైత్‌ ఖాన్‌ టాప్‌ 5లో నిలుస్తుందని, ఫైనల్‌ వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ముమైత్‌ ఇలా మద్యలోనే తన ఆటను వదిలేయాల్సి వస్తుందని ఊహించలేదు.

మరిన్ని వార్తలు:

ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

ట్రైలర్‌, టీజర్‌.. ఇప్పుడు స్టంపర్‌

అప్పుడు డ్రగ్స్‌ ఆరోపణలు బండ్ల.. ఇప్పుడు మద్దతు