రజినీకాంత్ జైలర్ మూవీకి ఆ సెంటిమెంట్ కలిసొచ్చేనా ?

Rajinikanth
Rajinikanth

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ అంటేనే చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్క నటుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా హిట్ అయితే చాలు ఇకమీదటఅదే తరహాలోనే సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు.అలా సెంటిమెంట్ ని ఫాలో అయ్యేవారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ముందుంటారు.

అయితే ఇప్పుడు తాజాగా తలైవా నటించిన జైలర్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ నేపథ్యంలో తలైవా తన సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు.అని అయినా అభిమాను అంటున్నారు. రజినీకాంత్ తన సినిమాల విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లేవారు.

అదే సెంటిమెంటు నీ ఫాలో అవుతూ ఎప్పటి మాదిరాగానే ఈ మూవీ రిలీజ్ కి ముందు హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ మధ్యన ఆరోగ్యం కారణంగా కొంత కాలంగా హిమాలయాలకు వెళ్ళలేదు సూపర్ స్టార్. అయితే ఆ సినిమాలు అన్నీ అంతగా కలిసిరాలేదు.

దీంతో జైలర్ మూవీ విడుదల కానుండటంతో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది గతంలో కూడా చాలా సినిమాలకు తలైవా ఇలాగే సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. మరో వైపు సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

చెన్నై, బెంగళూరు నగరాల్లో రజినీకాంత్ మూవీ విడుదల నేపథ్యంలో ఏకంగా కొన్ని కంపెనీలు సెలవు ప్రకటించాయి.దీంతో ఆయనకు ఉన్నక్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. తెలుగు నటుడు సునీల్ తమిళ్ నటుడు యోగిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విడుదలైన ప్రీమియర్ షో ల ద్వారా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్టు సమాచారం. రజనీకాంత్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మాత్రం హిట్ చేరినట్టే అని తెలుస్తుంది, ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం.