ముమైత్‌ రీఎంట్రీ.. విమర్శలు

mumaith khan re enter into the big boss show after SIT interrogation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా బిగ్‌బాస్‌ షోకు మంచి క్రేజ్‌ ఉంది. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే వారు ఎలిమినేషన్‌ అయితే తప్ప 70 రోజుల పాటు బిగ్‌బాస్‌ ఇంటి నుండి బయటకు వెళ్ల కూడదు. బయటకు వెళ్లిన వ్యక్తులు మళ్లీ లోనికి మళ్లీ వెళ్లలేరు. గతంలో పలు సందర్బాల్లో బయటకు వెళ్లిన పార్టిసిపెంట్స్‌ మళ్లీ లోనికి రావడం వీలు పడలేదు. అయితే తెలుగు బిగ్‌బాస్‌ షో కోసం రూల్స్‌ను బ్రేక్‌ చేయడం జరిగింది. తెలుగు బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్న ముమైత్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె షో నుండి ఎలిమినేట్‌ చేస్తారని అంతా భావించారు. కాని నిర్వాహకులు స్వయంగా ఆమెను బిగ్‌బిగ్‌బాస్‌ ఇంటి నుండి బయటకు తీసుకు వచ్చి, హైదరాబాద్‌లోని సిట్‌ కార్యలయానికి తీసుకు వెళ్లి మళ్లీ ఆమను బిగ్‌బాస్‌ ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది.

ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ చరిత్రలో ఇలా జరిగింది లేదు. మొదటి సారి ముమైత్‌ కోసం రూల్స్‌ను మార్చారు. తెలుగులో ప్రారంభం అయ్యి రెండు వారాలు కూడా కావడం లేదు అప్పుడు రూల్స్‌ను బ్రేక్‌ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బిగ్‌బాస్‌ షో మద్యలోంచి ఒక పార్టిసిపెంట్‌ను బయటకు పంపి మళ్లీ ఆ వ్యక్తిని లోనికి తీసుకు రావడాన్ని కొందరు తప్పుబడుతున్నా, ముఖ్యమైన సందర్బం కనుక తప్పలేదు అని కొందరు అంటున్నారు. మొత్తానికి ముమైత్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ ఇంటికి చేరడం పట్ల ప్రస్తుతం ఇంట్లో ఉన్న ప్రతి పార్టిసిపెంట్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు, అలాగే ప్రేక్షకులు కూడా ముమైత్‌ రాకతో సంతోషంగా ఉన్నారు. ప్రేక్షకుల ఆనందం కోసమే మళ్లీ ముమైత్‌ ఖాన్‌ను ఇంట్లోకి చేర్చినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ బిగ్‌బాస్‌ షో రూల్స్‌ను బ్రేక్‌ చేసింది ఏమీ లేదని, గతంలో హిందీ బిగ్‌బాస్‌ షోలో కూడా ఒకటి రెండు సార్లు ఇలా జరిగిందని స్టార్‌ మా వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు

దిల్‌రాజుకు మూర్తన్న సలహా

రవితేజ ఫ్యాన్స్‌ రచ్చరచ్చ

సాయిపల్లవి పద్దతి కొత్తగా ఉంది