నానితో పాటు బన్నీతో కూడా చర్చలు

Bigg Boss Telugu Season 2 Will HOST in Nani or Allu Arjun

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హిందీలో దాదాపు పది సంవత్సరాలుగా బిగ్‌బాస్‌ షో నిరాటంకంగా సాగుతూ వస్తుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం ఎంతో ఆసక్తిని చూపే బిగ్‌బాస్‌ను తెలుగులో గత సంవత్సరం ప్రారంభించారు. మొదటి సీజన్‌కు అనూహ్య రెస్పాన్స్‌ దక్కింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడంతో తెలుగులో బిగ్‌బాస్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ డబుల్‌ ఇమేజ్‌ తీసుకు వచ్చాడు. అయితే రెండవ సీజన్‌కు ఎన్టీఆర్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్‌, ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈనేపథ్యంలోనే షో నిర్వాహకులు మరో స్టార్‌ను హోస్ట్‌గా ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్‌ ప్లేస్‌ను నాని భర్తీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. 90 రోజులతో త్వరలోనే రెండవ సీజన్‌ను ప్రారంభించబోతున్నట్లుగా అంతా భావించారు. నాని దాదాపుగా ఓకే చెప్పినట్లే అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు నానితో పాటు అల్లు అర్జున్‌ను కూడా ఈ షో కోసం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాని కంటే అల్లు అర్జున్‌కు ఎక్కువ క్రేజ్‌ ఉంది. అయితే యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సత్తా నానికి ఎక్కువ ఉందని, గతంలో వ్యాఖ్యతగా చేసిన అనుభవం నానికి ఉండటం వల్ల కూడా ఎక్కువ శాతం నానికి ఫ్రిపర్‌ చేస్తున్నారు. అయితే నాని మాత్రమే కాకుండా బన్నీతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ బన్నీ బిగ్‌బాస్‌ను చేయాలని కోరుకుంటున్నారు. మరి బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ను హోస్ట్‌ చేసే అవకాశం ఇద్దరిలో ఎవరికి వస్తుందో చూడాలి. వేసవి చివర్లో రెండవ సీజన్‌ను ప్రారంభించడం ఖాయం అని మా వర్గాల వారు చెబుతున్నారు.