యాంకర్‌ ల వ్యాఖ్యలపై దుమారం…

Tollywood Celebrities fires on TV5 Anchor Controversy Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ సినీ తారలపై టీవీ5 యాంకర్‌ చేసిన వ్యాఖ్యలపై రోజు రోజుకు దుమారం పెరుగుతుంది. హీరోయిన్స్‌ మరియు నటీమనులు అవినీతి పరుల వద్ద తీసుకుని వ్యభిచారం చేస్తున్నారు అంటూ టీవీ5 యాంకర్‌ చేసిన వ్యాఖ్యలు నటీనటుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. ఇప్పటికే ఆయనపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు, యాంకర్‌ తీరుతో పాటు, సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో సినిమా వారిపై వస్తున్న వ్యాఖ్యలు, వార్తలపై కూడా ఇండస్ట్రీ వారు ఆందోళనకు నడుం భిగించారు. సినిమా వారు అంటే అందరికి చులకన అయ్యిందని, వారి కష్టాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అంటూ తాజాగా జరిగిన కార్యక్రమంలో నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా టీవీ5 యాంకర్‌ వ్యాఖ్యలకు నిరసనగా క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో మా కార్యవర్గ సభ్యులు మరియు సినీ రంగం ప్రముఖులు పాల్గొన్నారు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి మరియు హేమ ఇతయి పాల్గొన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ… ఇండస్ట్రీ వారిని, వారి బతుకు వారిని బతకనివ్వండి. ఒక్కరు ఇద్దరు చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తంను చులకనగా చేసి మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని, నోరు అదుపులో పెట్టుకోక పోతే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్బంగా మా కార్యవర్త సభ్యులు మరియు మంచు లక్ష్మి హెచ్చరించారు. సినిమా పరిశ్రమకు టీవీ5 యాంకర్‌ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, సదరు ఛానెల్‌లో క్షమాపణలు రోజంతా ఇవ్వాలని లేకపోతే ఎంతదూరం అయినా వెళ్తామని మా సభ్యులు హెచ్చరించారు. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.