మీడియా తో రాహుల్ ని పట్టిన కోమటిరెడ్డి ?

komatireddy brothers as Telangana Congress president

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా వున్న జానారెడ్డి అటు వెంకయ్య నాయుడు మీద ప్రశంసలు కురిపించడం, ఇటు పీసీసీ అధ్యక్షుడిగా వున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్ కావడం వంటి పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్ని ఆశ్చర్యానికి ప్, నిరాశకి గురి చేస్తున్నాయి. ఇదే అదనుగా కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణాలో హస్తం పగ్గాలు చేజిక్కించుకునేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ మేరకి వారికి 10 జనపథ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు తెలుస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈ మధ్య రాహుల్ గాంధీని కలిసి తెలంగాణాలో పార్టీ పరిస్థితి బాగా లేదని , నాయకత్వ మార్పు లేకుంటే ఇంకా దిగజారే ప్రమాదం ఉందని చెప్పారట. మీరు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ ని 2019 లో అధికారంలోకి తెచ్చే బాధ్యత తాము తీసుకుంటామని అడిగారట. రెడ్డి సామాజిక వర్గం, ఆర్ధిక బలంతో పాటు ఈ మధ్య తీసుకున్న రాజ్ న్యూస్, ఇక ఓ పత్రిక నడిపే ఆలోచన అన్నీ పూస గుచ్చినట్టు రాహుల్ కి వివరించారట. మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ మీడియా రంగంలో వ్యయం చేయడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుకు రావడం మీద రాహుల్ ఖుషీ అయ్యారట. అందుకే పీసీసీ అద్యక్ష పీఠం కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరికి అప్పజెప్పేందుకు కూడా 10 జనపథ్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ హవా మొదలైతే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న జానా, ఉత్తమ్ లకి ఎదురు దెబ్బ తప్పదు.
ఈ అక్టోబర్ లో ఉత్తమ్ కి పీసీసీ అధ్యక్షుడిగా గడువు ముగియనుంది. ఆపై ఆ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ని కూర్చోబెడితే పార్టీ శాసన సభ పక్ష నేతగా రెడ్డేతర సామాజికవర్గానికి చెందిన నాయకుడిని కూర్చోబెట్టే ఆలోచనలో వుంది కాంగ్రెస్ హైకమాండ్. అంటే జానారెడ్డి స్థానంలో ఇంకో నాయకుడు వస్తాడు అన్నమాట. అది భట్టి కావొచ్చని ఓ అంచనా. ఏదేమైనా మీడియా తో రాహుల్ ని కోమటిరెడ్డి బ్రదర్స్ బుట్టలో వేశారనే టాక్ కాంగ్రెస్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు

జగన్ కి బాబు ఫోటో చూపుతున్న వ్యూహకర్త ?

కడుపు చించుకుంటే కాళ్ల మీద పడింది

ఐటీకి ఒక రూల్.. టాలీవుడ్ కు మరో రూల్