AP Politics: షర్మిల ఎఫెక్ట్‌.. ఏపీ కాంగ్రెస్ లో చేరికలు..!

AP Politics: Sharmila effect.. Joins in AP Congress..!
AP Politics: Sharmila effect.. Joins in AP Congress..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను షర్మిల గారు స్వీకరించిన తర్వాత ఎంతో మంది కాంగ్రెస్ నేతలు సొంతగూటికి చేరే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. వైకాపా నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం వల్ల సుమారు 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, వారికి మరొక ప్రత్యామ్నాయం లేదని అన్నారు. జనసేన, టీడీపీ పార్టీలలో చేరినా వారికి టికెట్ దక్కే అవకాశాలు లేవని అన్నారు.

ఎందుకంటే రెండు పార్టీలలోనూ అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తయిందని, కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు సరైన అభ్యర్థులే లేరని, కానీ నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏడు శాతం ఓటు బ్యాంకును సంపాదించు కునే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. వైకాపాకు దన్నుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లకు పెద్ద బొక్క పడనుందని తెలిపారు.

జాతీయ స్థాయిలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, ట్రిపుల్ తలాక్ బిల్లు కారణంగా ముస్లిం మహిళలు మాత్రం బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు కాబట్టి ముస్లిం మైనారిటీలు జగన్ మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలిచారని, ఇక వైకాపా గెలుపులో కీలక పాత్ర పోషించిన క్రిస్టియన్ మైనారిటీలు షర్మిల గారి వైపు చూస్తారనడంలో సందేహం లేదని అన్నారు.