ఫ్యాన్సీ ధరకు “నా సామిరంగ ” ఓటీటీ..ఎక్కడంటే..?

ఫ్యాన్సీ ధరకు
Cinema News

కింగ్ నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న ఒక ప్యూర్ విలేజ్ యాక్షన్ డ్రామా “నా సామిరంగ”. మరి ఇప్పుడు వరకు వచ్చిన మూవీ పై సాలిడ్ బజ్ ని నెలకొల్పగా సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ ల్లో ఇదొకటిగా నిలిచింది. ఇక ఈ మూవీ కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు బయటకి వస్తున్నాయి. అలా ఈ మూవీ ఓటిటి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఫ్యాన్సీ ధరకు "నా సామిరంగ " ఓటీటీ..ఎక్కడంటే..?
Naa Saami Ranga

దీని ప్రకారం ఈ మూవీ ఓటిటి డీల్ అయితే లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు అయితే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది . మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ మూవీ లో యంగ్ హీరోస్ అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా ముఖ్య పాత్రల్లో నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.