పేర్ని నాని… బూతుల నాని అని విమర్శించిన బాబు… నాని ఫైర్

పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు తనను బూతుల నాని అని విమర్శించారు అని ఆరోపించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ని, బాబుని ఎప్పుడైనా అవమానింనా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో తన కుమారుడు ప్రజలకు సేవ చేశాడన్నారు. చంద్రబాబు విషపు మాటలు మాట్లాడారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బండారుతో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.