‘గుంటూరు కారం’ చివరి 45 నిమిషాలు పూనకాలే : నాగవంశీ

‘గుంటూరు కారం’ చివరి 45 నిమిషాలు పూనకాలే : నాగవంశీ
Cinema News

సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నది . ఇప్పటికే సినిమా బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. తరచూ అప్డేట్స్ ఇస్తూ మూవీ ల పై ప్రేక్షకులకు అంచనాలు పెంచుతోంది. మరో మూడ్రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది . ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసి అందులోనే ట్రైలర్ రిలీజ్ చేయాలని యోచిస్తోంది.

‘గుంటూరు కారం’ చివరి 45 నిమిషాలు పూనకాలే : నాగవంశీ
Guntur Karam

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మహేశ్‌ అభిమానులతో సోషల్‌మీడియా వేదికగా మాట్లాడుతూ ఒక క్రేజీ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు అదిరిపోతుందని అన్నారు. ఫైట్ సీక్వెన్సులు, ఎమోషనల్ సీన్స్, కుర్చీ సాంగ్ ఈ సినిమాను ఒక రేంజ్ లో తీసుకెళ్లిందని తెలిపారు. ఇవన్నీ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు. సంక్రాంతికి ఈ సినిమా పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఫసాఫ్ట్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుందని సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.