తనయుడితో కలిసి టీడీపీ లో చేరిన మాజీ ఎంపీ నంబూరు సుభానీ

గుంటూరు తూర్పు మాజీ ఎంపీ నంబూరు సుభానీ, ఆయన కుమారుడు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ టీడీపీలో చేరారు. వీరంతా నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు నుంచి తన మద్దతుదారులతో కలిసి ర్యాలీగా ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని, టీడీపీ లో చేరారు. 2004లో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సుభానీ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన సుభానీ ఇప్పుడు టీడీపీలో చేరారు.