అఖిల్‌ అప్పుడే ఎలా వస్తాడు?

Akhil Akkineni Next Movie Updates With Vikram Kumar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అఖిల్‌ మొదటి సినిమాతో తాను తీవ్రంగా నిరాశ పడటంతో పాటు, అక్కినేని ఫ్యాన్స్‌ను ప్రేక్షకులందరిని కూడా నిరుత్సాహ పర్చాడు. మొదటి సినిమా అంతటి డిజాస్టర్‌ అవ్వడంతో అఖిల్‌ రెండవ సినిమాకు చాలా సమయం తీసుకున్నాడు. కథ, దర్శకుడు ఇలా చాలా విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మొదటి సినిమా నిర్మాణ విషయాలను పట్టించుకోని నాగార్జున రెండవ సినిమాను తానే స్వయంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌పై పూర్తి క్లారిటీ రానేలేదు. అప్పుడే సినిమా విడుదల తేదీని నాగార్జున ప్రకటించాడు.

మొన్నమొన్ననే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతలోనే డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్నది అనుకున్నట్లుగా ఈ తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తీసుకుంటూ వెళ్తున్నాడు కనుక సినిమాను తక్కువ సమయంలోనే మంచి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడి కూతురు హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి సినిమాను సైలెంట్‌గా శరవేగంగా పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ సినిమాను డిసెంబర్‌ మూడవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు:

సంపూ ఎక్కడ?

ఫిదా ముందు నిలువలేక పోతున్నాడు

ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్‌?