ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్‌?

sameer or madhu priya who be eliminated this time from ntr big boss show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న ‘బిగ్‌బాస్‌’ షో విమర్శలు, ప్రశంసల మద్య సాగిపోతూ ఉంది. తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో అంటూ ప్రచారం చేసిన ‘బిగ్‌బాస్‌’ షోను మొదటి వారం భారీగా ప్రేక్షకులు చూశారు. ఇక ఎన్టీఆర్‌ వచ్చే శని, ఆదివారాల్లో కూడా షోను విపరీతంగా చూస్తున్నారు. దాంతో స్టార్‌ మాటీవీ నెం.1 స్థానంకు చేరిన విషయం తెల్సిందే. మొదటి వారంలో జ్యోతి ఎలిమినేట్‌ అవ్వగా, రెండవ వారంలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. రెండవ వారం ఎలిమినేషన్‌ కోసం మధుప్రియ, సమీర్‌, ప్రిన్స్‌ ఇంకా సంపూర్నేష్‌బాబు నామినేషన్‌ అయిన విషయం తెల్సిందే. 

ఈ నలుగురిలో సంపూర్నేష్‌బాబు మద్యలోనే వెళ్లి పోయాడు, కనుక ప్రస్తుతం ముగ్గురు మిగిలి ఉన్నారు. ఆ ముగ్గురిలో ప్రిన్స్‌ కెప్టెన్‌ అయ్యాడు కనుక ఎలిమినేషన్‌కు ఛాన్స్‌ లేదు. ఇక మధు ప్రియ మరియు సమీర్‌లు మాత్రమే ఎలిమినేషన్‌ ముందు ఉన్నారు. సమీర్‌ కంటే ఎక్కువ మధు ప్రియకు క్రేజ్‌ ఉంది. ఎలిమినేషన్‌ దశలో ఉన్న మదుప్రియకు ప్రేక్షకుల మద్దతు భారీగానే ఉండేది. కాని ఆమె షో రెండవ రోజు నుండే కంటిన్యూగా ఏడుస్తుంది. దాంతో మధుప్రియకు ఛాన్స్‌ ఇచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా లేదు. అందుకే మధుప్రియకు ఎలిమినేషన్‌ తప్పదని భావిస్తున్నారు. ఇద్దరిలో ఎక్కువ ఛాన్స్‌ మధుప్రియకు ఉంది, అలాగని సమీర్‌ సేఫ్‌గా ఉంటాడని కూడా పూర్తిగా చెప్పలేం. మొత్తానికి వీరిద్దరిలో ఒకరు నేడు లేదా రేపు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం

మరిన్ని వార్తలు:

ముమైత్‌ రీఎంట్రీ.. విమర్శలు

ప్రభాస్‌ కు కథ రెడీ చేసిన జక్కన్న..?

సీఎంపై వర్మ ప్రశంసల జల్లు