జానకి మూవీలో బికినీతో ప్రగ్యా రచ్చ

Pragya Started Bikini Attacks On Telugu Audience

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘జయ జానకి నాయక’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ను హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌తో చేయించడం జరిగింది. ప్రగ్యా ఈ సాంగ్‌ కోసం ఓవర్‌ డోస్‌ ఎక్స్‌పోజింగ్‌ను చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతుంది. భారీ పారితోషికం తీసుకుని ఈ అమ్మడు భారీగా ఎక్స్‌ పోజింగ్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

‘కంచె’ చిత్రంలో యువరాణిగా పద్దతిగా, అందంగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కూడా ప్రగ్యా హుందాగా కనిపించింది. ఆ తర్వాత విష్ణు సరసన ఒక సినిమాలో నటించి అందాల ఆరబోత చేసింది. అప్పటి నుండి కూడా ప్రగ్యా జైస్వాల్‌ అందాల విందు చేస్తూనే ఉంది. తాజాగా నక్షత్రం చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించి యమ గ్లామర్‌గా కనిపించిన ముద్దుగుమ్మ ప్రగ్యా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జయ జానకి నాయక’ చిత్రంలో ఒక హాట్‌ ఐటెం సాంగ్‌ చేసింది. ఆ ఐటెం సాంగ్‌లో ప్రగ్యా జైస్వాల్‌ దుమ్ము దుమ్ముగా అందాల ప్రదర్శణ చేసింది. ముఖ్యంగా బికినీతో రెచ్చి పోయినట్లుగా చెబుతున్నారు. సినిమాలో ఈమె చేసిన ఐటెం సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

మరిన్ని వార్తలు:

డ్రగ్స్‌ కేసులో స్టార్స్‌ అరెస్ట్‌ లేనట్లే

సీఎంపై వర్మ ప్రశంసల జల్లు