డ్రగ్స్‌ కేసులో స్టార్స్‌ అరెస్ట్‌ లేనట్లే

K Chandrashekar Rao says stars not to be arrested for drug use

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో సినీ ప్రముఖులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. సినీ నటులతో పాటు, పలువురు డ్రగ్స్‌ రాకెట్‌ నిర్వాహకులను ప్రశ్నించింన విచారణ అధికారులు త్వరలో ఒక రిపోర్ట్‌ను సిద్దం చేయనున్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ తీసుకున్న వారిని దోషులుగా భావించగకుండా వారిని కేవలం బాధితులుగా భావించాలని అన్నారు. డ్రగ్స్‌ తీసుకున్న వారు బాధితులు అయినట్లయితే వారిని అరెస్ట్‌ చేయడం లేదా సీరియస్‌గా వారిని విచారించే అవకాశం ఉండదు.

సినీ పరిశ్రమలో వందల సంఖ్యలో డ్రగ్స్‌ తీసుకునే వారు ఉన్నారు. అందులో ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రముఖ నిర్మాత కొడుకు ఇంకా ఎంతో మంది ఉండటంతో ఇటీవల సినీ ప్రముఖులు అంతా కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని, దయచేసి ఈసారికి వదిలేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. అందుకే కేసీఆర్‌ తాజాగా మాట్లాడుతూ డ్రగ్స్‌ తీసుకున్న వారు బాధితులు అవుతారు, దోషులు కారు అంటూ చెప్పుకొచ్చారు. దాంతో సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ కారు అని తేలిపోయింది. ఈ సమయంలోనే వారికి డ్రగ్స్‌ సరఫరా చేసే వారిని అరెస్ట్‌ చేసి వార పట్ల కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు:

ప్రభాస్‌, జక్కన్న.. మళ్లీ అవే వార్తలు

ముమైత్‌ రీఎంట్రీ.. విమర్శలు

దిల్‌రాజుకు మూర్తన్న సలహా