ప్రభాస్‌ కు కథ రెడీ చేసిన జక్కన్న..?

prabhas to do movie with rajamouli again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దాదాపు అయిదు సంవత్సరాలు ప్రభాస్‌, రాజమౌళిలు కలిసి ‘బాహుబలి’ చిత్రాన్ని చేయడం జరిగింది. రెండు పార్ట్‌లుగా విడుదలైన ఆ సినిమా భారీ విజయాలను దక్కించుకుంది. ఈ సినిమాతో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘సాహో’ చిత్రాన్ని సుజీత్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ‘జిల్‌’ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గతంలో పలు సార్లు ఈ వార్తలు మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. సోషల్‌ మీడియాలో పలు సార్లు ఈ వార్తలు ట్రెండ్‌ అయ్యాయి. కాని రాజమౌళి కాని, ప్రభాస్‌ కాని అధికారికంగా ఆ వార్తలను నిర్థారించలేదు. తాజాగా మరోసారి అవే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్న రాజమౌళి తర్వాత సినిమాను ఎన్టీఆర్‌ హీరోగా చేసే అవకాశాలున్నాయి. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందనే ఊహాగాణాలు వ్యక్తం అవుతున్నాయి. ‘బాహుబలి’ చిత్రం సమయంలోనే ప్రభాస్‌ కోసం జక్కన్న ఒక కథ సిద్దం చేయడం, ఆ కథకు ప్రభాస్‌ ఓకే చెప్పడం జరిగిపోయింది. ప్రభాస్‌ ఎప్పుడైనా ఆ సినిమాలో నటించేందుకు సిద్దం అంటూ రాజమౌళికి హామీ ఇచ్చాడు. కనుక 2019లో రాజమౌళి, ప్రభాస్‌ల కాంబో మూవీ సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఆ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని మీడియాలో ప్రచారం జరగుతుంది. అది ఎంత వరకు నిజమవుతుంది అనే విషయం చూడాలి.

మరిన్ని వార్తలు

ముమైత్‌ రీఎంట్రీ.. విమర్శలు

దిల్‌రాజుకు మూర్తన్న సలహా

రవితేజ ఫ్యాన్స్‌ రచ్చరచ్చ