సీఎంపై వర్మ ప్రశంసల జల్లు

Ram Gopal Varma Praises CM KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏ టాపిక్‌పై స్పందిస్తాడో, ఎలా స్పందిస్తాడో అర్థం కాదు. ఇటీవల డ్రగ్స్‌ కేసులో విచారణ సజావుగా సాగడం లేదని, సెలబ్రెటీలు అవ్వడం వల్లే ఎక్కువ సమయం విచారించడం చాలా విచారకరం అంటూ వ్యాఖ్యలు చేసిన వర్మ విమర్శల పాలు అయ్యాడు. సిట్‌ అధికారులు మీడియా ముందుకు వచ్చి తమకు అంతా సమానం అని, తాము ఎవరిని టార్గెట్‌ చేయము అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా వర్మ తెలంగాణ సీఎం కేసీర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించి గొప్ప సీఎం అంటూ పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. 

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ తీసుకున్న వారు దోషులు కాదు అని, వారిని బాధితులుగా పరిగణించాల్సిందిగా కేసీర్‌ చెప్పడం జరిగింది. వారికి డ్రగ్స్‌ను సరఫరా చేసిన వారిని అరెస్ట్‌ చేసి వారిని శిక్షించాలంటూ కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఆ మాటలు వర్మకు చాలా బాగా నచ్చాయి. డ్రగ్స్‌ తీసుకున్న వారిని బాధితులుగా పేర్కొనాలంటూ కేసీఆర్‌ అధికారులకు చెప్పడంను వర్మ ప్రశంసించాడు. సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థవంతంగా అర్థం చేసుకున్నారని, విచారణ జరుపుతున్న సిట్‌ అధికారులు కూడా కేసీఆర్‌ మార్గంలో వెళ్లాలని వర్మ కోరుకున్నాడు. కేసీఆర్‌ ఆలోచించినట్లుగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభ్యం అవుతుందని వర్మ అభిప్రాయ పడ్డాడు.