అఖిల్ నా కొడుకు లాంటి వాడు అని ట్వీట్ చేసిన మెగాస్టార్

అఖిల్ నా కొడుకు లాంటి వాడు అని ట్వీట్ చేసిన మెగాస్టార్

‘‘అందరికీ హాయ్. బాగున్నారా! మీతో ఇలా మాట్లాడి చాలా రోజులు అవుతుంది. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే రేపు (ఏప్రిల్ 8) నా పుట్టినరోజు. పుట్టినరోజు అనగానే అభిమానులందరూ సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కేక్ కటింగ్స్ చేస్తుంటారు. కానీ ఈసారి ఎవ్వరూ అలా చేయకండి. ఈ సమయంలో అవి కరెక్ట్ కాదు. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి. రేపు (ఏప్రిల్ 8) ఏ పోస్టర్ కానీ, టీజర్ కానీ విడుదల చేయడం లేదు. ఇది నా బాధ్యతగా భావిస్తూ నేను ఏమీ రిలీజ్ చేయడం లేదు. నిర్మాత, దర్శకుడు అడిగినా కూడా వద్దని చెప్పాను. ఈ విషయం మీకు చెబుదామనే ఇలా వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ధైర్యంతోనే, మీ బలంతోనే సినిమాలు చేస్తుంటాం. కానీ ఆ బలం, ఆ ధైర్యం ఇప్పుడు మీ కుటుంబాలకు అవసరం. వాళ్లతోనే ఉండండి. క్షేమంగా, ధైర్యంగా ఉండండి. రేపు నేను మీ అందరికోసం మా ఫ్యామిలీతో దిగిన ఓ ఫొటో పోస్ట్ చేయబోతున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీ ఫొటో తీసుకోండి. నాకోసం పోస్ట్ చేయండి. ఇండియా కోసం.. ప్రపంచం కోసం.. ఈ కరోనా-కోవిడ్ 19పై అందరం కలిసి ఫైట్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు’’ అని అఖిల్ ఈ వీడియోలో తెలిపారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా అఖిల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. `హ్యాపీ బర్త్‌డే అఖిల్. చరణ్‌కి ఒక తమ్ముడు. నాకు, సురేఖకు మరో కొడుకు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. అందరూ ఇష్టపడే వ్యక్తి. ఈ ఏడాదంతా నీకు మంచి జరగాలి` అని చిరంజీవి ట్వీట్ చేశారు. తనకు, నాగార్జునకు మధ్యలో ఉన్న చిన్నారి అఖిల్ ఫొటోను పోస్ట్ చేశారు.