బొటన వేలిపై చిరంజీవి పుస్తకం

బొటన వేలిపై చిరంజీవి పుస్తకం

ప్రపంచంలోనే అతి చిన్న పుస్తకాన్ని రాసి 50 ప్రపంచ రికార్డులను ఓ తెలుగు మహిళ సొంతం చేసుకుంది. మాజీ మిసెస్‌ యూనివర్స్‌ హిమజా నాయుడు బొటన వేలిపై ఇమిడిపోయే పుస్తకంలో చిరంజీవి గురించి పొందుపరచింది. ఆమె రాసిన పుస్తకాలను బుధవారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమి , ఏబీసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వరల్డ్‌ రికార్డ్స్‌ కో ఆర్డినేటర్‌ కేవీ రమణ రావు హిమాజా నాయుడు పేరిట 50 ప్రపంచ రికార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మరేడుపల్లికి చెందిన అవార్డు గ్రహీత హిమజా నాయుడు మాట్లాడుతూ… ఈ పుస్తకాలు రాయడానికి ఏడు రోజులు సమయం పట్టిందన్నారు. ఒక్కో పేజీలో నాలుగు పదాలను రాసినట్లు వివరించారు. బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ రాములు పాల్గొన్నారు.