ఎందుకు అదే అడుగుతున్నారు? 

Ileana Wants to stop questioning about her boyfriend
Posted September 10, 2017 at 16:44 
సాధార‌ణంగా కాస్త పేరున్న హీరోయిన్ ఎవ‌ర‌యినా ….ప్రేమ‌లో ఉంద‌ని తెలిస్తే…మీడియా నుంచి సాధార‌ణ ప్రేక్ష‌కుల వ‌ర‌కూ అంద‌రికీ ఆమె ప్రేమాయ‌ణంపై చాలా ఆస‌క్తిగా ఉంటుంది. హీరోయిన్ న‌టించే సినిమాల గురించి కాకుండా ఆమె లవ్వ‌ర్ కు సంబంధించిన  విష‌యాలు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సినిమా షూటింగుల విరామంలోనో, ఏద‌న్నా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాల్లోనో, మ‌రింకెక్క‌డైనా హీరోయిన్ క‌నిపిస్తే  అవే ప్ర‌శ్న‌లు వేస్తుంటారు. ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి హీరోయిన్ కు ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతూనే ఉంటాయి. కానీ అందరిలా వాటిని టేకిటీజీగా తీసుకోవ‌టం లేదు గోవా బ్యూటీ ఇలియానా.
 త‌న ల‌వ్వ‌ర్ గురించి జ‌నాలు, మీడియా ప‌దే ప‌దే ప్ర‌శ్నించ‌టం ఆమెకు తెగ చిరాకు తెప్పిస్తోంది. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తెలిపింది. ఇటీవ‌లి కాలంలో తాను ఎక్క‌డికి వెళ్లినా…సినిమాల గురించి  కాకుండా త‌న బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నింబోస్ గురించి ప్ర‌శ్న‌లు మీద ప్ర‌శ్న‌లు వేస్తూ విసిగిస్తున్నార‌ని ఇలియానా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో మండిప‌డింది. ఇది త‌న‌కు చాలా బాధ క‌లిగిస్తోంద‌ని, నలుగురిలో ఉన్న‌ప్ప‌డు ఎల్ల‌కాలం న‌వ్వుతూనే క‌నిపించ‌లేనని చెప్పింది. త‌ను ప‌బ్లిక్ ఫిగ‌ర్ నే కానీ…ప‌బ్లిక్ ప్రాప‌ర్టీని కాద‌ని,  తాను చేస్తున్న‌ది త‌ప్పు అని చెప్పే హ‌క్కు ఎవ్వ‌రికీ లేద‌నిఇలియానా వ్యాఖ్యానించింది. మిగ‌తా మ‌గ‌వారంతా త‌మ భార్య‌లు, త‌ల్లుల ప‌ట్ల ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారా అని ప్ర‌శ్నించిన ఇలియానా…త‌ను ఓ అమ్మాయినే అని…త‌మ ఇంట్లో ఆడ‌వారికి ఇచ్చే గౌర‌వం త‌న‌కెందుకు ఇవ్వ‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది.
త‌న బాయ్ ఫ్రెండ్ గురించి అడ‌గ‌టంలో త‌ప్పులేద‌ని, కానీ చాలా మంది అత‌ని జాతి గురించి ప్ర‌శ్నిస్తున్నార‌ని, ఆండ్రూ తెల్ల‌గా ఉంటాడు కాబ‌ట్టే తాను డేటింగ్ చేస్తున్నాన‌ని అంటున్నార‌ని…అదొక్క‌టే త‌న‌కు న‌చ్చ‌ని విష‌య‌మ‌ని ఇల్లూ చెప్పుకొచ్చింది. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నందుకు పెద్ద క్లాసే పీకింది ఇలియానా.  ఈ విష‌యాన్నంత‌గా గ‌మ‌నించిన సినీ జ‌నాలు…ప‌దేళ్ల‌ నుంచి సినిమాల్లో న‌టిస్తున్న ఇలియానాకు ఏ విష‌యంలో సీరియ‌స్ అవ్వాలో… ఏ విష‌యాన్ని టేకిటిజీగా తీసుకోవాలో అర్ధం కావ‌ట్లేదు అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఇలియానా…ఇటీవ‌ల బాలీవుడ్ పై దృష్టిపెట్టింది. ఆమె న‌టించిన బాద్ షాహో చిత్రం ఇటీవ‌లే విడుద‌లైంది. బాక్సాఫీసు వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. విడుద‌లైన రెండు వారాల్లోనూ బాద్ సాహోకు రూ. 50కోట్లు వ‌చ్చాయి. ఈ సినిమాతో ఇలియానాకు బాలీవుడ్ లో  బ్రేక్ వ‌చ్చింద‌ని భావిస్తున్నారు.  
SHARE