అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చ‌ర‌ణ్ కూడా…

Ram Charan Praising Arjun Reddy

Posted September 10, 2017 at 16:03 

 Ram Charan Praising Arjun Reddy

అర్జున్ రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి హీరో, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు ఈ సినిమాను తెగ పొగుడుతున్నారు. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ కూడా అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చేరాడు. అర్జున్ రెడ్డి సినిమా చూశాన‌ని, య‌దార్థంగా, వాస్త‌వికంగా, నివ్వెర‌పోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని చ‌ర‌ణ్ ప్రశంసించాడు. హీరో, హీరోయిన్ తో పాటు చిత్రంలోని ప్ర‌తిఒక్క‌రూ అద్భుతంగా న‌టించార‌ని కొనియాడారు. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డికి, చిత్ర‌యూనిట్ కు చెర్రీ అభినంద‌న‌లు తెలిపాడు.
చిన్న సినిమాగా వ‌చ్చి సంచ‌ల‌నాత్మ‌క విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయింది. ఈ సినిమాను తీసిన విధానంపై అనేక‌మంది నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అదే స‌మ‌యంలో యువ‌త‌ను చెడ‌గొట్టేలా ఉందంటూ తీవ్ర విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా విష‌యంలో జ‌రిగినంత చ‌ర్చ మ‌రే సినిమా గురించీ జ‌ర‌గ‌లేదు. హీరో క్యారెక్టర్ ను  విభిన్నంగా చూపించిన విధానం యూత్‌ను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.  
సినిమాలోని డైలాగుల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి గురించి మాట్లాడ‌ని ప్రేక్ష‌కుడు, విమ‌ర్శ‌కుడు లేరంటే అతిశ‌యోక్తి కాదు.  ఈ విమ‌ర్శ‌లు, ప్ర‌శంస‌ల  సంగ‌తి ఎలా ఉన్నా…సినిమా మాత్రం వ‌సూళ్ల ప‌రంగా కొత్త రికార్డులు క్రియేట్‌చేస్తోంది. రూ. 4కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన అర్జున్‌రెడ్డి రూ. 40 కోట్ల‌దాకా వ‌సూలుచేస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.  వ్య‌క్తుల‌తో ప‌నిలేకుండా సినిమా జ‌యాప‌జ‌యాలు మాత్ర‌మే మాట్లాడే ఇండ‌స్ట్రీలో అర్జున్ రెడ్డి గొంతు మార్మోగుతోంది. 
మరిన్ని వార్తలు:
SHARE