ఆమె గురించి స‌రిగ్గా తెలియ‌నే తెలియ‌దు

Hardik Pandya Clarified The Rumors About Parineeti Chopra

Hardik Pandya Clarified The Rumors About Parineeti Chopra

ఓ హీరోయిన్ ట్వీట్ కు  స‌ర‌దాగా రియాక్ట‌యి నెట్ లో అడ్డంగా బుక్క‌య్యాడు క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా.  ఇటీవ‌ల బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా ట్విట్ట‌ర్ లో ఓ సైకిల్ ఫొటో పోస్ట్ చేసింది. అద్భుత‌మైన పార్ట‌నర్‌తో ప్ర‌యాణం…ల‌వ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని ఆ ఫొటోకు క్యాప్ష‌న్ కూడా పెట్టింది. దీనిపై హార్దిక్ పాండ్యా స‌ర‌దాగా రియాక్ట‌య్యాడు. ఆ పార్ట‌న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు. మ‌రో బాలీవుడ్, క్రికెట్ లింక్ క‌దా అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను స‌ర‌దాగా స్వీకరించిన ప‌రిణీతి ఆ పార్ట‌న‌ర్ మ‌రెవ‌రోకాదు…నా సైకిలే అంటూ ప్ర‌తిస్పందించింది.  
ఈ ట్వీట్ల సంగ‌తిని ఇక్క‌డితో వారిద్ద‌రూ మ‌ర్చిపోయారు. కానీ నెటిజ‌న్లు మాత్రం ఊరుకోలేదు. అమ్మాయిపై కాదు…ముందు ఆట‌పై శ్ర‌ద్ధ పెట్టు అని హార్దిక్ పాండ్య‌కు కొంద‌రు నెటిజ‌న్లు ఉచిత స‌ల‌హా ఇచ్చారు. మ‌రికొంద‌రు ఇంకాస్త ముందుకె|ళ్లి హార్దిక్ పాండ్య‌, ప‌రిణీతిచోప్రా మ‌ధ్య  ప్రేమాయ‌ణం న‌డుస్తోందంటూ పుకార్లు మొద‌లుపెట్టారు. అస‌లే బాలీవుడ్ కు క్రికెట్ కూ విడ‌దీయ‌లేని లింక్ ఉండ‌టంతో ఈ పుకార్లు వేగంగా స్ప్రెడ్ అయ్యాయి. చివ‌ర‌కు విలేక‌రులు ప‌రిణీతిచోప్రాను ప‌దే ప‌దే ఈ విష‌యంపై ప్ర‌శ్నించ‌టం మొద‌లుపెట్టారు. దీంతో ప‌రిణీతి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. తానిప్పుడు సింగిలా..కాదా అన్న చ‌ర్చ అన‌వ‌స‌ర‌మ‌న్న ప‌రిణీతి హార్దిక్ పాండ్యాతో త‌న‌కెలాంటి బంధం లేద‌ని స్ప‌ష్టంచేసింది.
తెలియ‌ని వారే కాకుండా త‌న స్నేహితులు, స‌న్నిహితులు కూడా హార్దిక్ పాండ్యా గురించి త‌న‌ను అడ‌గ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని చెప్పుకొచ్చింది. తాజాగా హార్దిక్ పాండ్యా కూడా ఈ రూమ‌ర్ల‌ను ఖండించాడు. ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై స్పందించిన పాండ్యా అస‌లు ప‌రిణీతి చోప్రా గురించి త‌న‌కు స‌రిగ్గా తెలీనే తెలీదు అంటున్నాడు. తాను శ్రీలంక‌లో ఉన్న‌ప్పుడు ఈ ట్వీట్ల గొడ‌వ జ‌రిగింద‌ని పాండ్యా చెప్పాడు. త‌న‌కు ఎవ‌రితో ఎఫైర్లు అంట‌గ‌ట్టినా ప‌ట్టించుకోన‌ని, ఈ విష‌యంలో త‌ను చెప్పాల్సింది ఏమీ లేద‌ని పాండ్యా అన్నాడు. ప‌రిణీతితో స‌రిగ్గా మాట్లాడింది కూడా లేద‌ని పాండ్యా స్ప‌ష్టంచేశాడు. త‌మ మ‌ధ్య ఏమీ లేదంటూ ప‌రిణీతి చోప్రా, పాండ్యా వివ‌ర‌ణ ఇచ్చినా వారి మీద సాగుతున్న పుకార్ల‌కు మాత్రం తెర‌ప‌డ‌టం లేదు. గ‌తంలోనూ క్రికెట‌ర్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన బాలీవుడ్ హీరోయిన్లంద‌రూ మొద‌ట ఏమీ లేద‌నే చెప్పేవార‌ని…త‌ర్వాత త‌ర్వాతే వారి బంధం బ‌య‌ట‌ప‌డింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. 
SHARE