ఏపీలో ఇసుక లెక్కేంటి..?

Sand Maphia in Andhra Pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Sand Maphia in Andhra Pradesh

ఏపీ తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఏ లోటూ రానీయడం లేదు. ఏపీ ఇంత బలహీనంగా ఉన్నా రాష్ట్రం గురించి మాట్లాడటానికి చంద్రబాబే కారణమని చాలా మంది నేతలు చెబుతున్నారు. అత్యుత్తమ పాలన అందిస్తున్న చంద్రబాబు.. ఇసుక విషయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న విధానం అందుబాటులోకి తెచ్చారు. ఫ్రీ ఇసుక పాలసీతో.. ఇసుక మాఫఇయాను అణగదొక్కాలని భావించారు. కానీ అధికారుల అలసత్వంతో ఆయన ఆశయాలకు తూట్లు పడ్డాయి.

గతంలో మాదిరిగా కాకపోయినా.. అక్కడక్కడా ఇసుక మాఫియా తలెగరేస్తూనే ఉంది. ఎర్రచందనం మాఫియాను కఠినంగా అమలుచేసిన తరహాలోనే.. ఇసుక మాఫియా పని పట్టాలని ఏకంగా క్యాబినెట్ మీటింగులో బాబు ఆదేశాలిచ్చారు. టాడా కేసులు పెట్టాలన్న ఆదేశాలతో మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చంద్రబాబు సీరియస్ అయ్యారంటే పనైపోయినట్లేనని భయపడుతున్నారు. కేసులతో ఆగని సీఎం.. స్వయంగా తానే రీచుల్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని చెప్పడం మరింత చర్చనీయాంశమైంది.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండగా చంద్రబాబు చేసిన తనిఖీలు గుర్తొచ్చి అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. జనాల ముందే తమను ఉతికి ఆరేస్తారని భయపడుతున్నారు. అటు నేతలు కూడా చంద్రబాబు ఎవర్ని పట్టుకుంటారోనని వణికిపోతున్నారు. వారానికో రీచ్ ను చంద్రబాబు సర్ ప్రైజ్ విజిట్ చేసినా ఇసుక విధానం ఆశయాలు నెరవేరతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు: