మ‌హిళ కాపురంలో చిచ్చుపెట్టిన మోడీ పెయింటింగ్‌..

Muslim Women Got Punished Because of Modi Painting
Posted September 10, 2017 at 15:14 
న‌రేంద్ర మోడీపై అభిమానం ఓ ముస్లిం మ‌హిళ కొంప‌ముంచింది. మోడీ బొమ్మ‌గీసినంద‌కు అత్తింటివారు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బల్లియాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. బల్లియా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల న‌గ్మా ప‌ర్వీన్ కు రెండేళ్ల క్రితం బ‌స‌రిక్ పూర్ గ్రామానికి చెందిన యువ‌కుడితో వివాహం జ‌రిగింది. కొన్నిరోజుల క్రితం వ‌ర‌కూ వారి కాపురం స‌జావుగానే సాగింది.
కానీ న‌గ్మా గీసిన ఓ పెయింటింగ్ ఆమె కాపురంలోll ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పెయింటింగులు వేసింది. వాటిని భ‌ర్త‌కు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు చూపించిన‌ప్ప‌టినుంచి న‌గ్మాకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. న‌గ్మా గీసిన బొమ్మ‌లు చూసిన అత్తింటివారు ఆమెను చావ‌బాది ఇంట్లో నుంచి గెంటివేశారు. దీంతో న‌గ్మా పుట్టింటికి చేరింది.
అకార‌ణంగా న‌గ్మాను చావ‌బాదినా ఆమె భ‌ర్త‌కు కోపం త‌గ్గ‌లేదు. పుట్టింటికి గెంటేసిన న‌గ్మాను శాశ్వ‌తంగా వ‌ద‌లించుకుని మ‌రో పెళ్లి చేసుకోవాల‌ని ఆమె భ‌ర్త ప్లాన్ చేశాడు.  విష‌యం తెలుసుకున్న న‌గ్మా అత్త‌వారింటికి వెళ్లగా మ‌రోసారి భ‌ర్త‌, అత‌ని కుటుంబ‌స‌భ్యులు ఆమెపై దాడిచేశారు. దీంతో న‌గ్మా తండ్రితో క‌లిసి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. మ‌తిస్థిమితం కోల్పోయి పెయింటింగ్ లు వేస్తోందంటూ అత్తింటివారు త‌న కుమార్తెను కొట్టి త‌రిమేశార‌ని న‌గ్మా తండ్రి త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు న‌మోదుచేశారు. న‌గ్మా భ‌ర్త‌కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రుల చిత్రాలు గీసినందుకు ఓ మ‌హిళ‌ను అత్తింటివారు గెంటేయ‌టం దారుణ‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
SHARE