సావిత్రిలో షాలిని పాండే….

Posted September 10, 2017 at 14:59 

 Shalini Pandey Selected in Savithri

 
అర్జున్ రెడ్డి హీరోయిన్ కు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి.ఇప్ప‌టిదాకా సాధార‌ణ క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఆఫ‌ర్లే షాలిని పాండే ముందుకు రాగా…తాజాగా ఓ ప్రిస్టేజియ‌స్ ప్రాజెక్టులో ఆమెకు కీల‌క‌పాత్ర ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న సావిత్రి సినిమాలో షాలిని పాండే కీ రోల్ పోషించ‌నున్నారు. సావిత్రి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కు అర్జున్ రెడ్డిలో షాలిని న‌ట‌న న‌చ్చ‌టంతో సావిత్రిలో అవ‌కాశం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వైజ‌యంతి మూవీస్ సావిత్రి చిత్రాన్ని నిర్మిస్తోంది.
సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. సమంత మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేశ‌న్ గా దుల్క‌ర్ స‌ల్మాన్, చ‌క్ర‌పాణి పాత్ర‌లో ప్ర‌కాశ్ రాజ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కుతున్న సావిత్రి 2018లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినీ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి జీవితంలో ఉత్తాన ప‌తనాల‌ను చ‌విచూశారు. ఎవ‌రూ ఊహించని స్థాయికి ఎదిగిన‌ట్టుగానే…అక్క‌డినుంచి అధఃపాతాళానికి ప‌డిపోయారు. తాగుడుకు బానిసై చివ‌రిరోజుల్లో అత్యంత దుర్భ‌ర‌మైన జీవితం గ‌డిపారు.
అందుకే సావిత్రి జీవితం ఎంద‌రో హీరోయిన్ల‌కు గుణ‌పాఠం లాంటిది. సావిత్రి జీవితం తెర‌చిన పుస్త‌క‌మే అయినా..ఇప్ప‌టిదాకా ఆమె క‌థ‌ను తెర‌కెక్కించ‌టానికి ఎవ‌రూ సాహ‌సం చెయ్య‌లేదు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ సాహ‌సానికి పూనుకున్నారు. ఆయ‌న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సావిత్రి జీవితంలో అంద‌రికీ తెలిసిన విష‌యాల‌తో పాటు…ఎవ‌రికీ తెలియ‌ని అనేక కోణాల‌నుస్పృశించ‌నున్నారు నాగ్ అశ్విన్‌. 
SHARE