ఆ గొడవలతో కాంగ్రెస్ కి మీడియా దొరికింది.

Congress got media with these obstacles

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలో ప్రధానమైంది మీడియా అండ లేకపోవడం. ఆంధ్రప్రదేశ్ లో విభజన పుణ్యమా అని మీడియా వున్నా, లేకున్నా పరిస్థితిలో పెద్ద తేడా వచ్చేదేమీ కనిపించడం లేదు. కానీ తెలంగాణాలో పరిస్థితి అలా కాదు. కాంగ్రెస్ వాదుల్లో ఎక్కడో మిణుకుమిణుకు మంటూ అధికారం మీద ఆశ కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ తో పాటు తెరాస సర్కార్ వైఫల్యాలు తమకు అచ్చి వస్తాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అందుకే నిన్నమొన్నటిదాకా సైలెంట్ గా వున్న చాలా మంది ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి యాక్టివ్ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ కి అధికారం అనే పాయింట్ మాటెలా వున్నా ఆ పార్టీ లో గొడవలు ఓ రకంగా కీడు చేస్తుంటే,ఇంకో రకంగా మేలు చేస్తున్నాయి.

ఉత్తమ్ కుమార్ టి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటినుంచి కోమటిరెడ్డి సోదరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉత్తమ్ వల్ల పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పేందుకు వాళ్ళు ఢిల్లీ స్థాయిలో తమ వాణి వినిపించారు.తమకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ కి అధికారం తెచ్చి తీరతామని ఆ పెద్దల ముందు చెప్పారు. కెసిఆర్ హవా చూసిన కాంగ్రెస్ పెద్దలు కూడా ఓ దశలో ఉత్తమ్ ని పక్కన పెడదామని చూసారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని స్పెషల్ గా చూసారు. దీంతో వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం ఓ ఛానల్ పెట్టేసారు. ఇక పత్రిక కూడా తెచ్చే ఆలోచనలో వున్నారు. అయితే పైకి పార్టీ కోసం అని చెబుతున్నా ఛానల్. పత్రిక కోమటిరెడ్డి బ్రదర్స్ భజన చేస్తాయని ఊహించిన ఉత్తమ్ అలెర్ట్ అయ్యారు. ఢిల్లీ పెద్దలకి పార్టీ కోసం మీడియా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పి వారిని శాంతపరిచారు. మొత్తానికి ఈ ఇద్దరి గొడవ వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ కి రెండు చానెల్స్, రెండు పత్రికలు అండగా రాబోతున్నాయి.

మరిన్ని వార్తలు: