జీఎస్టీ అంటే గ‌ర‌వి, సాంచి, త‌ర‌వి…

Gujarat GST Babies Names Are Garavi, Sanchi And Taravi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జీఎస్ టీ అంటే గూడ్స్ అండ్ స‌ర్వీస్ టాక్స్ అని మ‌నంద‌రికీ తెలిసిన నిర్వ‌చ‌నం. కానీ గుజ‌రాత్ కు చెందిన ఓ మ‌హిళ దృష్టిలో మాత్రం జీఎస్ టీ అంటే గ‌ర‌వి, సాంచి, త‌ర‌వి అని అర్ధం. ఎందుకంటే ఆమె త‌న‌కు పుట్టిన ముగ్గురు పిల్ల‌ల‌కు జీఎస్ టీ గుర్తుగా ఈ పేర్లు పెట్టుకుంది. సూర‌త్ కు చెందిన కాంచ‌న్ ప‌టేల్ కు శ‌నివారం ఒకే కాన్పులో ముగ్గురు ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. జీఎస్‌టీతో ఒకే దేశం ఒకే ప‌న్ను తీరు కాంచ‌న్ ప‌టేల్ కు న‌చ్చ‌డంతో త‌న శిశువుల‌కు గ‌ర‌వి, సాంచి, త‌ర‌వి అని నామ‌క‌ర‌ణం చేసింది. గ‌తంలో రాజ‌స్థాన్ కు చెందిన ఓ మ‌హిళ కూడా ఇదే త‌ర‌హాలో త‌న కుమార్తెకు జీఎస్టీ అని పేరు పెట్టింది. జులై నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన జీఎస్ టీ స్వ‌తంత్ర భార‌త‌దేశంలో అతిపెద్ద ప‌న్నుల సంస్క‌ర‌ణ‌గా భావిస్తున్నారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా విస్తృతం చ‌ర్చ జ‌రుగుతోంది.

మరిన్ని వార్తలు:

అర్జున ర‌ణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌

40 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే రిటైర్మెంట్