‘మహానుభావుడు’ కథ కాపీ

is mahanubhavudu movie story copy from malayalam movie 'North 24 Kaatham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘భలే భలే మగాడివోయ్‌’, ‘బాబు బంగారం’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లు అందుకున్న మారుతి ఈ సంవత్సరం ‘శతమానం భవతి’ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్‌తో తెరకెక్కించిన చిత్రం ‘మహానుభావుడు’. ఈ సినిమా గురించి నిన్న మొన్నటి వరకు ఎలాంటి ప్రచారం జరగలేదు. ఎప్పుడైతే టీజర్‌ను వదిలారో అప్పటి నుండి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌కు విశేష ఆధరణ లభించింది. కొన్ని గంటల్లోనే స్టార్‌ హీరో ట్రైలర్‌కు వచ్చిన స్థాయిలో ఏకంగా రెండు మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న ఈ సినిమా కథ కాపీ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

నాలుగు సంవత్సరాల క్రితం మలయాళంలో విడుదలైన ‘నార్త్‌ 24 కాత్తమ్‌’ అనే సినిమా కథ నుండి సగానికి పైగా ‘మహానుభావుడు’లో వాడేశారని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుందని, అయితే ఇది వారి నుండి అనుమతి తీసుకుని చేశారా లేక కొట్టేశారా అనే విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి. మారుతి గతంలో కూడా ఒక కథ వివాదంలో ఇరుకున్నాడు. ఒక రచయిత కథను మారుతి సినిమాను తీసేందుకు సిద్దం అయ్యాడు, ఆ కథ తనది అంటూ ఆ రచయిత మీడియా ముందుకు రావడంతో మారుతి సినిమాను వదిలేశాడు. ఇప్పుడు ‘మహానుభావుడు’ సినిమాపైకి ఆ మలయాళ చిత్ర యూనిట్‌ సభ్యులు రారు కదా అని కొందరు శర్వానంద్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.