బాహుబలిని దాటిన జైలవకుశ.

Jai Lava Kusa Crossed to Bahubali records

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి కొట్టని రికార్డు లేదు. అందుకే ఆ సినిమా తర్వాత ఎవరు, ఏ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి చెప్పాలి అనుకున్నా నాన్ బాహుబలి అనే మాటతో మొదలు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడప్పుడే బాహుబలిని దాటే ఆలోచన చేయడానికి కూడా భయపడే పరిస్థితి. ఇంతటి ల్యాండ్ మార్క్ సినిమాని గుంటూరు లో జైలవకుశ దాటేయబోతోంది. అదెలాగంటే… గుంటూరు లో మొత్తం 27 సినిమా థియేటర్స్ ఉంటే, బాహుబలి 23 హాల్స్ లో విడుదల అయ్యింది. కానీ జైలవకుశ ఇప్పుడు మొత్తం 27 థియేటర్స్ లో విడుదల అవుతోంది. జైలవకుశ రేపు రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో గానీ ఇప్పుడు నిజంగానే ఓ సందర్భంలో బాహుబలిని దాటేసింది.