మహానుభావుడు ప్రివ్యూ…

Mahanubhavudu Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   శర్వానంద్ ,  మెహ్రీన్ , వెన్నెల కిషోర్ , రఘు బాబు 
నిర్మాత :      వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ 
దర్శకత్వం :    మారుతి  
మ్యూజిక్ డైరెక్టర్ :  తమన్ ఎస్.ఎస్ 
ఎడిటర్ :      కోటగిరి వెంకటేశ్వర రావు 
సినిమాటోగ్రఫీ :  నిజార్ షఫీ 

యంగ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో యువీ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం మహానుభావుడు. టైటిల్ సీరియస్ గా వున్నా సినిమాలో మ్యాటర్ కామెడీ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా తేలిపోయింది. కంటెంట్ నచ్చితే ఏ ప్రయోగం చేయడానికి అయినా వెనుకాడని హీరో శర్వానంద్. ఇక యువీ క్రియేషన్స్ కూడా ఏదో కొత్తదనం కోసం ట్రై చేస్తూనే వుంది. ఇక డైరెక్టర్ మారుతీ కామెడీ సెన్స్ గురించి ఎవరికీ సందేహం లేదు. ఈ ముగ్గురి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు కొండంత వినోదం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో హీరో శర్వాకి అతి శుభ్రం అనే జబ్బు ఉంటుంది. అలాంటి అబ్బాయి ప్రేమలో పడితే ఎదురు అయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి ? తాను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి ఆ అబ్బాయి శుభ్రత లేని జీవితాన్ని గడపాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతాయి? ఈ విషయాన్ని హాస్యంతో చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు మారుతీ. అంతకుముందు మతిమరుపు జబ్బు వున్న కుర్రోడి ప్రేమ కథతో నాని హీరోగా మారుతి చేసిన భలే భలే మగాడివోయ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా ప్రెకషకుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన యువీ క్రియేషన్స్ కూడా అదే నమ్మకంతో దసరా బరిలో పెద్ద సినిమాలు వున్నా లెక్క చేయకుండా మహానుభావుడు విడుదలకి రెడీ అయిపోయింది.