మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?

Jai Lava Kusa Movie Will Stand between Spyder ,Mahanubhavudu Movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దసరా కానుకగా ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో, మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాల మద్య అటు ఇటుగా వారం రోజుల గ్యాప్‌ ఉంది. ‘జై లవకుశ’ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేయబోతుండగా, స్పైడర్‌ సినిమా ఈనెల 27న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా గ్యాప్‌లో వస్తున్న కారణంగా ఒకదానితో ఒకటి ఢీ లేనట్లే చెప్పుకోవచ్చు. అయితే స్పైడర్‌ చిత్రాన్ని శర్వానంద్‌ ఢీ కొట్టేందుకు సిద్దం అవుతున్నాడు. స్పైడర్‌ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే శర్వానంద్‌ ‘మహానుభావుడు’గా వచ్చేందుకు ముస్తాబయ్యాడు.

మారుతి దర్శకత్వంలో శర్వానంద్‌, మెహ్రీన్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఉన్నారు. ఆ నమ్మకం కారణంగానే స్పైడర్‌తో ఢీకి మారుతి, శర్వాలు సిద్దం అయ్యారు. ఈనెల 27న మహేష్‌బాబు స్పైడర్‌ విడుదల కానుండగా, 29న మహానుభావుడు విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు గ్యాప్‌తో రానున్న నేపథ్యంలో ఆసక్తికర పోటీ నెలకొంది. మహేష్‌బాబు స్పైడర్‌ చిత్రం సునామిలో మహానుభావుడు నిలబడి, కలెక్షన్స్‌ను రాబట్టగలడా అంటూ కొందరు సినీ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘శతమానంభవతి’ సినిమాను చిరంజీవి, బాలకృష్ణలకు పోటీ చేసి సక్సెస్‌ అయిన శర్వానంద్‌ సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తాడా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

ఆ గొడవలతో కాంగ్రెస్ కి మీడియా దొరికింది.

ఈ నెల 22నుంచి శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు