చైతూ, సామ్‌ రిసెప్షన్‌ అప్‌డేట్స్‌

naga chaitanya samantha marriage reception details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా నాగచైతన్య, సమంతల వివాహం కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహ నిశ్చితార్థం అవ్వగా పెళ్లి వచ్చే నెలలో జరుగబోతుంది. ఇప్పటికే అధికారికంగా డేట్‌ను ఫిక్స్‌ చేశారు. అక్టోబర్‌ 6న గోవాలో ఒక చర్చ్‌లో క్రిస్టియన్‌ పద్దతిలో వివాహం జరుగబోతుంది. ఆ తర్వాత హిందూ పద్దతిలో కూడా వివాహం చేసుకోనున్నారు. పెళ్లికి చాలా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించనున్నారు. ఇక రిసెప్షన్‌కు స్నేహితులు, ఇండస్ట్రీ వారు, కొందరు ఫ్యాన్స్‌ను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు. 

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని ఫ్యామిలీ స్థాయిలో నాగచైతన్య రిసెప్షన్‌ ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి అక్టోబర్‌ 6న జరుగనుండగా, రిసెప్షన్‌ను అదే నెల 10న వైభవంగా హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నాగార్జున్‌ అండ్‌ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిసెప్షన్‌ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. సమంత కుటుంబ సభ్యులు కూడా రిసెప్షన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. చెన్నైలో సమంత కుటుంబ సభ్యులు నిర్వహించాలని భావిస్తున్న రిసెప్షన్‌పై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.

మరిన్ని వార్తలు:

చివరి ఘట్టం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

బాబోయ్‌.. ఏంటి ఈ కాంబినేషన్‌?