చివరి ఘట్టం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌

jr-ntr-telugu-bigg-boss-came-to-climax

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్టార్‌ మాటీవీలో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 1 చివరి ఘటంకు చేరింది. నిన్న ఈసీజన్‌ చివరి ఎలిమినేషన్‌ పక్రియ జరిగింది. ఇక ముందు ఎలిమినేషన్‌కు నామినేషన్‌లు ఉండవు అంటూ బిగ్‌బాస్‌ తెలియజేశాడు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారు శివబాలాజీ, నవదీప్‌, ఆదర్ష్‌, హరితేజ, అర్చన, దీక్ష. ఈ ఆరుగురిలో ఈ వారం నామినేషన్‌కు శివబాలాజీ, నవదీప్‌లు తప్ప మిగిలిన నలుగురు అయ్యారు. ఆ నలుగురిలో ఇద్దరు ఈ వారం ఇంటి నుండి వెళ్లి పోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఎక్కువ శాతం ఆదర్ష్‌ వెళ్లడం ఖాయం అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. మరొకరు కూడా వెళ్లాలి అంటే దీక్షాకు ఎలిమినేషన్‌ తప్పదని చెప్పుకోవచ్చు. ఇక ఆటలో శివబాలాజీ, నవదీప్‌, అర్చన, హరితేజాలు మాత్రమే మిగలనున్నారు. ఈ నుగురిలో టాస్క్‌ల ద్వారా లేదా మరే రకంగానైనా బిగ్‌బాస్‌ ఒక్కొక్కరు చొప్పున ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి క్లైమాక్స్‌కు చేరుకున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 1 ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరు వెళ్లి పోతారు, చివరిగా ఎవరు మిగులుతారు, వారిలో ఎవరు ఫైనల్‌ విజేత అవుతారు అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

అమెరికాను వ‌ణికిస్తున్న ఇర్మా

ఆ గొడవలతో కాంగ్రెస్ కి మీడియా దొరికింది.