అది మ‌హాన‌టి లుక్ కాదు..

keerthy suresh clarifies on mahanati first look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హాన‌టిలో సావిత్రిగా న‌టిస్తున్న కీర్తిసురేశ్ లుక్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ అవుతున్నాయి. సావిత్రిలో కీర్తి లుక్ అదుర్స్ అంటూ కూడా వెబ్ సైట్లు వార్త‌లు రాశాయి. కానీ ఆ ఫొటోల్లో కీర్తి చీర‌క‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ…అల‌నాటి సావిత్రి మేక‌ప్ తో క‌నిపించ‌లేదు. కానీ అంద‌రూ ఇదే మ‌హాన‌టిలో కీర్తి లుక్ అనుకున్నారు.

అయితే ఈ ఫొటోల‌పై కీర్తిసురేశ్ క్లారిటీ ఇచ్చారు. ట్విట్ట‌ర్ లో దీనిపై స్పందించిన కీర్తి ఈ ఫొటోలు మ‌హాన‌టి సినిమాకు సంబంధించిన‌వి కాద‌ని, ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో దిగిన‌వ‌ని స్ఫ‌ష్టంచేశారు. మ‌హాన‌టి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావ‌టానికి ఇంకా స‌మ‌య‌ముంద‌ని చెప్పారు. నిజానికి ఆ ఫొటోలు చూస్తే అవి మ‌హాన‌టి సినిమాలోవి కాద‌ని ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. సావిత్రి కాలం నాటి సెట్ వేసి మ‌హాన‌టి షూటింగ్ జరుపుతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి.

ఫొటోల్లో మాత్రం కీర్తిసురేశ్ ఈ కాలం అమ్మాయిలు ట్రెడిష‌న‌ల్ గా ఎలా ఉంటారో అలాంటి మేక‌ప్ లో ఉన్నారు. అయితే సినిమా షూటింగ్ మొద‌ల‌యి చాలా రోజులే గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కూ ఫస్ట్ లుక్ రిలీజ్ కాక‌పోవ‌టంతో చీర‌క‌ట్టులో కీర్తి క‌నిపించ‌గానే.. ఇదే మ‌హాన‌టి లుక్ అని అంద‌రూ భావించారు. కానీ కీర్తి ట్వీట్ ని బట్టి..సావిత్రి ఎలా ఉంటుందో చూడ‌టానికి మ‌రికొన్నాళ్లు ఎదురుచూడాల‌న్న‌మాట‌.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

బాబోయ్‌.. ఏంటి ఈ కాంబినేషన్‌?