జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

Tollywood Celebrities Huge Response For Jai Lava Kusa Movie Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆదివారం విడుద‌ల‌యిన జైల‌వ‌కుశ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది. లైక్స్ ప‌రంగా..వ్యూస్ ప‌రంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ పోషించిన జై,ల‌వ‌, కుశ మూడు పాత్ర‌లు క‌నిపిస్తుండ‌టంతో ట్రైల‌ర్ అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. సామాన్య ప్రేక్ష‌కులే కాకుండా సెల‌బ్రిటీలు సైతం ఈ ట్రైల‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ న‌ట‌న‌ను ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి ప్రశంసించారు.

తార‌క్ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటార‌ని, జై ప‌ర్‌ఫెక్ట్ గా ఉంద‌ని, ఆయ‌న‌ను వెండితెర‌పై చూడాల‌ని చాలా ఆతృత‌గా ఉంద‌ని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. రాజ‌మౌళితో పాటు అనేక‌మంది సెల‌బ్రిటీలు ట్రైల‌ర్ బాగుంద‌ని ట్వీట్ చేశారు. సీనియ‌ర్ న‌టి ఖుష్బూ తార‌క్…తార‌క్‌..తార‌క్‌…ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాన‌న్నారు. ఎన్టీఆర్ సినిమా జ‌న‌తా గ్యారేజ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ జై ని వెండితెర‌పై చూడాల‌ని ఆతృత‌గా ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ తార‌క్ మాత్ర‌మే న్యాయం అనే మాట‌కు న్యాయం చేయ‌గ‌ల‌రు అని వ్యాఖ్యానించారు.

తార‌క్ మంచిన‌టుడ‌ని, జైని చూడటానికి ఎదురుచూస్తున్నాన‌న్నారు రానా ద‌గ్గుబాటి. సాయి ధ‌ర‌మ్ తేజ అయితే వెరైటీగా ట్వీట్ చేశారు. జై పాత్ర‌కు ఉన్న న‌త్తిని గుర్తుచేస్తూ…చ‌..చ‌…చ‌..చంపేశావ్ తార‌క్ అని స‌ర‌దాగా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేస్తున్న జైల‌వ‌కుశ‌పై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలున్నాయ్‌. ఈ చిత్రానికి ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జ‌రిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న ద‌స‌రా కానుక‌గా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు:

ఎందుకు అదే అడుగుతున్నారు?

అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చ‌ర‌ణ్ కూడా…