వావ్‌.. నిజంగా ‘మహానటి’

telugu-cinema-people-fidaa-for-keerthi-suresh-mahanati-look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మహానటి సావిత్రి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎవరైనా హీరోయిన్‌ పద్దతిగా, హుందాగా, సంపూర్ణంగా కనిపించినట్లయితే మహానటి సావిత్రి మాదిరిగా ఉందని అంటూ ఉంటారు. అంతటి గుర్తింపు ఉన్న సావిత్రి గురించి జనాల్లో పలు రకాల అనుమానాలున్నాయి. ఆమె మరణం గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. వాటన్నింటికి సమాధానాలు చెప్పేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి పాత్రను కీర్తి సురేష్‌ పోషిస్తున్న విషయం తెల్సిందే.

మహానటిగా కీర్తి సురేష్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందని అనుమానం వ్యక్తం చేసిన వారికి తాజాగా విడుదలైన ఈ ఫొటో సమాధానం చెప్పకనే చెప్పింది. అందతో పాటు అద్బుతమైన నటి అయిన సావిత్రి పాత్రను పోషించడం అంటే మామూలు విషయం కాదు. నటన విషయం ఏమో కాని, అందంలో మాత్రం సావిత్రికి ఏమాత్రం తీసినపోని విధంగా వెండి తెర సావిత్రి కీర్తి సురేష్‌ కనిపించబోతున్నట్లుగా తొస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయిన ఈ వెండితెర సావిత్రి లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అచ్చు సావిత్రిలా ఉందని కీర్తి సురేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఆ గొడవలతో కాంగ్రెస్ కి మీడియా దొరికింది.

అమెరికాను వ‌ణికిస్తున్న ఇర్మా