మహానుభావుడు… తెలుగు బులెట్ రివ్యూ

Mahanubhavudu Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   శర్వానంద్ ,  మెహ్రీన్ , వెన్నెల కిషోర్ , రఘు బాబు 
నిర్మాత :      వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ 
దర్శకత్వం :    మారుతి  
మ్యూజిక్ డైరెక్టర్ :  తమన్ ఎస్.ఎస్ 
ఎడిటర్ :      కోటగిరి వెంకటేశ్వర రావు 
సినిమాటోగ్రఫీ :  నిజార్ షఫీ 

“మహానుభావుడు”… కామెడీ సినిమాకి ఈ టైటిల్ అనగానే మీ మొహం మీద తెలియకుండానే ఓ చిరునవ్వు వస్తుంది. కామెడీ సినిమాలు తీయడంలో దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డు , కంటెంట్ వున్న సినిమాలు చేస్తారని పేరు తెచ్చుకున్న యువీ క్రియేషన్స్, తన మనసుకి నచ్చితే చాలు సినిమా కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా వుండే శర్వానంద్. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అనగానే బోలెడన్ని అంచనాలు. పైగా దసరా సీజన్ లో ఎన్టీఆర్, మహేష్ లాంటి టాప్ స్టార్స్ సినిమాలు ఉన్నప్పటికీ మహానుభావుడు రిలీజ్ చేయడం ఆ సినిమా మీద ఆ ముగ్గురి నమ్మకం ఎలాంటిదో చెబుతుంది. ఇంతకుముందు సంక్రాంతికి కూడా చిరు ఖైదీ నెంబర్ 150 , బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి బరిలో ఉన్నప్పటికీ శర్వానంద్ శతమానంభవతి తో తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా చూసుకున్నప్పుడు మహానుభావుడు మీద ప్రేక్షకులు అంచనాలు పెంచుకోవడంలో తప్పేముంది ? అయితే ఆ అంచనాల్ని మహానుభావుడు అందుకున్నాడో, లేదో చూద్దామా.

కథ…

ఆనంద్ ( శర్వానంద్ ) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనే మానసిక సమస్య ఉంటుంది. అంత మాత్రాన ఇదేదో ప్రాణాలు తీసే సీరియస్ జబ్బు కాదు. కడిగింది కడగడం, తుడిచిందే తుడవడం లాంటి, వేసిన తాళాన్ని పదిసార్లు చూడడం లాంటిది. ఓ విధంగా చెప్పాలంటే అతి శుభ్రం. ఇలాంటి ఆనంద్ కి నీట్ నెస్ కి ప్రాధాన్యం ఇచ్చే అమ్మాయితో ( మెహ్రీన్ ) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అన్ని సినిమాల్లో లాగానే ఆ పిల్ల తండ్రికి అబ్బాయి నచ్చడు…కాదు కాదు అతని అతి శుభ్రం నచ్చదు. దీంతో ప్రేమించిన అమ్మాయి కోసం శుభ్రతకి ప్రాణం ఇచ్చే ఆనంద్ ఓ పల్లెటూరు వెళ్లాల్సివస్తుంది. అక్కడ అతనికి ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి ? ఆనంద్ ప్రేమని గెలుస్తాడా ? ఈ ప్రయత్నంలో అతి శుభ్రముతో ఆనంద్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అన్నదే మహానుభావుడు సినిమా.

విశ్లేషణ …

OCD తో బాధ పడే హీరో, అతని ప్రవర్తన, దాంతో ఎదురయ్యే పరిస్థితులు ఈ సినిమాకి ఆయువుపట్టు. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో మతిమరుపు చుట్టూ కథ అల్లుకున్న దర్శకుడు మారుతి ఈ సినిమాలో ocd ప్రాబ్లెమ్ ని టచ్ చేసాడు. వెంకటేష్ తో తీసిన బాబు బంగారం లో క్యారెక్టరైజేషన్ బాగున్నా దాని చుట్టూ అల్లుకున్న సీన్స్ పేలలేదు. అందుకే ఈసారి సెంట్రల్ పాయింట్ తో పాటు దాని చుట్టూ అల్లుకున్న సీన్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు మారుతి. రొటీన్ అనుకునే లవ్ సీన్స్ కూడా స్పెషల్ గా అనిపించేలా చూసుకున్నాడు. కధలో పాతదనం ఉన్నప్పటికీ హీరో కి వున్న సమస్య కొత్తది కావడం వల్ల ఎక్కడా ఆ అభిప్రాయం కలగదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్,సెకండ్ హాఫ్ అంతా మిమ్మల్ని సీటులో నిలవకుండా నవ్వించేస్తాయి. క్లయిమాక్స్ కూడా అదే స్థాయిలో వుంది.

ఏ ముగ్గురి మీద నమ్మకంతో ఈ సినిమా కి వెళతామో ఆ ముగ్గురు తమ మీద నమ్మకం నిలబెట్టుకున్నారు. ఓ విధంగా ఆ నమ్మకం పెంచుకున్నారు. శర్వానంద్ ఈ సినిమాలో ఒకటిరెండు చోట్ల మాత్రమే కనిపిస్తాడు. సినిమా అంతా ocd తో బాధపడే ఆనంద్ మాత్రమే కనిపిస్తాడు. సినిమా అయిపోయాక ఇంటిదాకా గుర్తొచ్చి నవ్విస్తాడు. ఇక మారుతి దర్శకత్వం కూడా చాలా బాగుంది. ఓ పాత కథని కొత్త పాయింట్ చుట్టూ అల్లుకుని కామెడీ తో ప్రేక్షకుల్ని ఆలరించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఇంకా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ …

శర్వానంద్ పాత్ర
కామెడీ , లవ్ ట్రాక్
సెకండ్ హాఫ్
డైరెక్టర్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ ..

అక్కడక్కడా రొటీన్ కామెడీ .

తెలుగు బులెట్ పంచ్ లైన్… దసరాకి కామెడీ “మహానుభావుడు” వచ్చాడు.
తెలుగు బులెట్ రేటింగ్ … 3.5 /5 .

Disclaimer: This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre