సర్కార్ డబ్బులతో మహానుభావుడు ప్రమోషన్.

Mahanbavudu movie free movie promotions in ap dasaravali event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ సినిమా ప్రమోషన్ కోసం సర్కార్ ముందుకు వస్తుందా ?. అలాంటిది ఎప్పుడూ జరగదు. మరీ గొప్ప సినిమా అనుకుంటే ఆ సినిమాకి పన్ను రాయితీ లాంటివి ఇస్తారు. కానీ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు స్టార్ హీరోల సినిమాల మధ్య రేసులోకి వచ్చినా సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళుతున్న మహానుభావుడికి భలే ఛాన్స్ తగిలింది. ఆ సినిమా ప్రమోషన్ చేసుకోడానికి ఊహించని అవకాశం దొరికింది. పైసా ఖర్చు లేకుండా వేదిక, కావాల్సినంత మంది జనం సమకూరారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓ సారి చూద్దామా.

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ వేదికగా ఏపీ సర్కార్ ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది. విశాఖ సాగర తీరంలో 6 రోజుల పాటు దసరావళి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. దాదాపు 4 కోట్ల వ్యయంతో శ్రేయాస్ మీడియా ఆ కాంట్రాక్టు దక్కించుకుంది. ఆ సంస్థ స్థానికంగా పనిచేసే ఇంకో ఈవెంట్ సంస్థకి సబ్ కాంట్రాక్ కి ఇచ్చిందట. ఈ ఈవెంట్ కి భారీగా పబ్లిసిటీ ఇచ్చారు. పెద్ద పెద్ద సినిమా స్టార్స్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని ప్రచారం జరిగింది. ప్రభుత్వమే చేస్తున్న ఫంక్షన్ కావడంతో స్టార్స్ వస్తారని జనం కూడా అనుకున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు బాగానే సాగినా సినిమా స్టార్స్ ని రప్పించడంలో నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. దీంతో జనం నిరాశపడుతున్నారని గ్రహించిన నిర్వాహకులకు మహానుభావుడు టీం సినిమా ప్రమోషన్ కి వచ్చిన విషయం తెలిసింది. ఆపసోపాలు పడి ఆ హీరో శర్వానంద్, దర్శకుడు మారుతి తదితరులు దసరావళి ఈవెంట్ లో పాల్గొనేలా ఒప్పించారు. దీంతో జనం లో హుషారు వచ్చింది. మహానుభావుడు టీం కి సర్కార్ డబ్బులతో పబ్లిసిటీ చేసుకునే అవకాశం దక్కింది. మొత్తానికి మహానుభావుడు భలే లక్కీ అనిపించాడు.