‘మహానుభావుడు’ లక్కీఫెల్లో

mahanubhavudu-movie-lucky-with-spyder-movie-flap-talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శర్వానంద్‌, మెహ్రీన్‌ జంటగా తెరకెక్కిన ‘మహానుభావుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘స్పైడర్‌’, ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రాలు దసరా బరిలో ఉన్నా కూడా ధైర్యంగా శర్వానంద్‌ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. శర్వానంద్‌ సంక్రాంతికి ‘శతమానంభవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చిరంజీవి, బాలకృష్ణలతో ఢీ కొట్టి మరీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అలాగే ఎన్టీఆర్‌ మరియు మహేష్‌బాబులతో శర్వానంద్‌ ఢీ కొట్టబోడున్నాడని అంతా అనుకున్నారు. అయితే శర్వానంద్‌కు పెద్ద కష్టం లేకుండా స్పైడర్‌కు నెగటివ్‌ టాక్‌ వస్తుంది.

జైలవకుశ చిత్రం విడుదలై వారం రోజులు దాటిన నేపథ్యంలో ఆ ప్రభావం ‘మహానుభావుడు’పై ఉండబోదు. స్పైడర్‌తో తలపడటం కష్టమే అనుకున్నారు కాని, ఆ సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్‌ అంటూ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండవ రోజు నుండే కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి. జైలవకుశ కలెక్షన్స్‌ స్టడీగా సాగుతున్నాయి. ‘మహానభావుడు’ కనీసం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ దసరాకు కూడా శర్వానంద్‌ మరో బ్లాక్‌ బస్టర్‌ కొట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే విడుదైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించాడు. తన గత చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ తరహాలోనే ఈ సినిమా ఉంటుందని మారుతి చెప్పకనే చెబుతున్నాడు.

భలే భలే మగాడివోయ్‌ సినిమా ఏ విధంగా అయితే సక్సెస్‌ను సాధించిందో అదే విధంగా ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల అభిమానంను సొంతం చేసుకుని కలెక్షన్స్‌ను సాధిస్తుందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. మహానుభావుడు సక్సెస్‌ అయితే స్పైడర్‌ కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద జై లవకుశ మరియు స్పైడర్‌ చిత్రాలు మాత్రమే ఉన్నాయి కనుక రెండు కూడా గౌరవ ప్రధమైన కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. మహానుభావుడు ఎంట్రీ ఇస్తే కలెక్షన్స్‌ ఖచ్చితంగా టర్న్‌ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మంచి సమయంలో రాబోతున్న మహానుభావుడు మోస్ట్‌ లక్కీఫెల్లో అంటూ విశ్లేషకులు అభినందిస్తున్నారు.