ఎఫ్ 2 ట్రైల‌ర్…బాగా న‌వ్వించేలా ఉన్నారుగా…!

F2 Movie Trailer

వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘F2’ (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాత. పటాస్, రాజా ధి గ్రేట్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. ఆధ్యంతం కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

ఎఫ్ 2 సినిమా ఫ‌స్ట్ సీన్ నుంచి నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉన్నాడు అనిల్ రావిపూడి. ఈ విషయం ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చాడు. వెంకటేష్ గత కొన్నేళ్లుగా ఎప్పుడూ చూడనంత కామెడీ చేశాడు ఈ సినిమాలో. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి టైంలో వెంకీ చేసిన కామెడీని ఎంత మిస్సయ్యామో ఈ సినిమా ఆ లోటుని తీర్చుస్తుంది. వరుణ్ తేజ్ త కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి కామెడీ రోల్ చేసాడు. మరి చూసెయ్యండి సంక్రాంతి అల్లుళ్ళ హంగామా.