యాత్ర ట్రైలర్….రాజశేఖరుడే మళ్ళీ వచ్చాడా…?

Yatra Movie Trailer

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ ‘యాత్ర’. పదవిలో ఉన్నది తక్కువ కాలమే అయినా మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలుస్తున్నారు ఆనందోబ్రహ్మ తీసిన దర్శకుడు మహి రాఘవ. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజా ట్రైలర్‌లో వైఎస్సార్‌ పాదయాత్రలో ప్రజలతో మమేకమైన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు.

ఇది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రెడ్డి అంటూ డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్‌లో.. ‘నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి’, ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వినాలని ఉంది.. ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ లాంటి డైలాగ్స్ వైఎస్‌ ను గుర్తు చేస్తున్నాయి. ఇక భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా వైసీపీకి బూస్ట్ కానుందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్ధం చేసుకోవచ్చు.