కవచం రిలీజ్ డేట్ – డిసెంబర్ 7

Kavacham Movie Release On December 7th

రిలీజ్ డేట్ : డిసెంబర్ 7
న‌టీన‌టులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌..
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్
నిర్మాత‌: న‌వీన్ సొంటినేని
నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు
ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్
ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా

Bellamkonda Srinivas Kavacham Release On December 7th
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ‘కవచం’. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ చిత్రానికి శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముకేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది.