బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా నిజమెంత…?

Bellamkonda Sreenivas Birthday Special Announcement

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే నిర్మాతల ఫ్యామిలీ నుండి హీరోగా నిలదొక్కుకున్న అతికొద్దిమందిలో ఒకడు. తీసినవి ఐదంటే ఐదు సినిమాలు. కానీ, మాస్ హీరో ఇమేజ్ దక్కించుకున్నాడు. ఈ ఐదింటిలో స్పీడున్నోడు ఒక్కటే మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా. మిగిలినవన్నీ బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ వేల్యూ కి మించి తీసిన భారీ బడ్జెట్ సినిమాలే. ఈ ఐదింటిలో ఎన్ని లాభాలు చవిచూశాయో తెలియదుగానీ కాస్తలో కాస్త జయ జానకి నాయక సినిమా మంచి వసూళ్లు సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఆరో సినిమా కవచం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించడంతో పాటు, రొటీన్ పోలీస్ డ్రామా లా ఉందే అనే ఫీలింగ్ ని కూడా ప్రేక్షకులలో కలిగించింది. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తుండగా, డిసెంబర్ 7 న విడుదలకాబోతుంది.

Bellamkonda Srinivas Movie Release On December

ఇక అసలు విషయానికి వస్తే, బెల్లంకొండ శ్రీనివాస్ ఎనిమిదవ సినిమా మీద ఇప్పుడు టాలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. తన 8 వ సినిమాని ఆహ నా పెళ్ళంట, పూల రంగడు, భాయ్ వంటి సినిమాలు తీసిన వీరభద్రం చౌదరి తో కమిట్ అయ్యాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నా, అవేవి నిజం కావని బెల్లంకొండ శ్రీనివాస్ తేల్చిచెప్పాడు. 7 వ సినిమా గురించి చెప్పకుండా 8 వ సినిమా గురించి వెళ్ళారేమిటా అని కంగారు పడకండి. బెల్లంకొండ శ్రీనివాస్ తన 7 వ సినిమా దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో చేసేందుకు అంగీకారం తెలిపాడు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తారు.

Bellamkonda Sreenivas 'Kavacham' first look