“కవచం” ప్రివ్యూ

kavacham movie preview

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసినవి నాలుగు సినిమాలు, కాని ఒక్కటి అయినా సరైనా హిట్ట్ మాత్రం దక్కలేదు. ఈసారి ఎలాగైనా హిట్ట్ కొట్టాలి అనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్ మమ్మిల్ల దర్శకత్వంలో కవచం అనే మూవీని చేశాడు. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ మరియు ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్సు వచ్చింది. ఈ చిత్రంలో సాయి ఇద్దరు ముద్దుగుమ్మలతో అడిపాడుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నది.

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను. ఓ పోలీస్ ఆఫీసర్ కు ఎదురైయే సమస్యలను తను ఏవిధంగా ఎదుర్కుంటాడు. అదే విధంగా పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వలన అతని జీవితం పూర్తిగా మారిపోతుంది అనే డిఫరెంట్ కథతో, నేను ఎప్పుడు చెయ్యని పాత్రను ఈ చిత్రంలో నేను చేస్తున్నాను. ఈ చిత్రం ఎలాగైనా విజయ్ సాదిస్తుంది అనే నమ్మకం నాకు ఉన్నది. ఈ డిసెంబర్ 7 న ఈ చిత్రం విడుదలవుతుంది తప్పకుండ ఈ చిత్రం మీకు నచ్చే విధంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 20 కోట్లుకు అమ్ముడు పోయింది.