టీఆర్ఎస్ కి లగడపాటి భార్య ప్రచారం…ఇదేమి విచిత్రమో…?

Lagadapati Rajagopal Wife Campaign For Trs Party

ఆంధ్రా అక్టోపర్ అనే పేరుతో సర్వేల పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితిని కంగారు పెడుతున్న లగడపాటి రాజగోపాల్ కు ఇది కాస్త ఇబ్బందికరమైన వార్తే. ఎందుకంటే తెలంగాణలో ప్రజాభిప్రాయం కాంగ్రెస్ వైపు ఉందని ఆయన చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ఆయన కేటీఆర్‌తో సంవాదం కూడా మీడియా సాక్షిగా చేసుకున్నారు. కేటీఆర్ ఒక వాట్సాప్ స్క్రీన్ షాట్ బయటపడితే లగడపాటి ఏకంగా చాట్ హిస్టరీనే బయటపెట్టారు. పోలింగ్‌ ముందు ఈ టెన్షన్ ఎందుకనుకున్నారో కానీ కేటీఆర్ సైలెంటయిపోయారు. అయితే లగడపాటికి ఇంట్లోనే సరిగ్గా అభిప్రాయ సేకరణ జరిపినట్లు లేరు అన్న సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని లగడపాటి చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్‌ డివిజన్‌లో ప్రచారం చేశారు. వాస్తవానికి ఆమె వారం పది రోజుల నుండి ప్రచారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే లగడపాటి సర్వే బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆమె ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అయిపోయాయి.

Lagadapati-Rajagopal-wife-p

ఓ వైపు లగడపాటి రాజగోపాల్ తన సర్వేల పేరుతో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఫలితం వస్తుందని చెబుతూంటే ఆయన భార్య మాత్రం అదే పార్టీకి ఓటయమని ప్రచారం చేస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే లగడపాటి మాజీ భార్య టీఆర్ఎస్‌కు ప్రచారం చేయడం వెనుక రాజకీయం లేదని స్నేహం కోసమే అని వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి… దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. పేరుకు ఖైరతాబాద్ నే కానీ జూబ్లిహిల్స్‌లో ఉండే సంపన్న ప్రాంతాలన్నీ ఖైరతాబాద్ నియోజకవర్గం కిందకే వస్తాయి. దానం నాగేందర్ సతీమణి అనిత, లగడపాటి పద్మ మిత్రులు. దీంతో స్నేహితురాలి భర్త కోసం పద్మ ప్రచారంలో పల్గొంతున్నారట. ఇది అసలు విషయం మరి.

padma-sri-trs-party