తెలిసితెలిసి ఎలా ఇరుక్కున్నావు కేటీఆర్…!

KTR Reveals Lagadapati WhatsApp Chat

తెలంగాణ రాజకీయాల్లో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పేరుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కేటీఆర్ చాలా విషయాలను ప్రభావితం చేస్తుంటాడు. సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి పనులు తదితర ప్రభుత్వ కార్యక్రమాల నుంచి పార్టీలోని కీలక విషయాలను స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తుంటాడు. ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో మెజారిటీ సభ్యులు కేటీఆర్ చెప్పినవారేనన్న ప్రచారమూ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని ముఖ్యమంత్రిని చేయడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న వార్తలు వచ్చాయి. వాస్తవానికి కేటీఆర్‌ది మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. వ్యూహాలు రచించడంలో ఎత్తుకు పైఎత్తు వేయడంలో ఆయన దిట్ట అనే టాక్ కూడా ఉంది.

ktr-chat-meeting

అలాంటి కేటీఆర్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో జరుగుతున్న వివాదంలో అనవసరంగా చిక్కుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజులుగా సర్వేల విషయంలో లగడపాటి తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల తిరుమలలో శ్రీవారి సాక్షిగా కొన్ని కీలక విషయాలను వెల్లడించారాయన. తాజాగా మంగళవారం మీడియా ముందు మరికొన్ని అంశాలను బయటపెట్టారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో ప్రజాకూటమి వైపే తెలంగాణ ఓటర్లు చూస్తున్నారట. దీనిపై కేటీఆర్ స్పందించాడు. సోషల్ మీడియాలో గతంలో లగడపాటితో జరిగిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్వీట్టర్ వేదికగా బయటపెట్టాడు. అందులో టీఆర్ఎస్ విజయం సాధించబోతుందని లగడపాటి వెల్లడించినట్లు ఉంది. అందుకే ఈ ఫొటోతో పాటు ‘జరిగిన కుట్ర బయటపెట్టేందుకే ఈ చాట్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా’ అని క్యాప్షన్ జోడించాడు. తెలంగాణలో ప్రజాభిప్రాయం … టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నా.. లగడపాటి రాజగోపాల్.. చంద్రబాబు ఒత్తిడితో తప్పుడు సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నారని… కేటీఆర్ నిన్న ట్విట్టర్‌లోఆరోపించారు. దీనికి సాక్ష్యంగా నవంబర్ 10 తేదీన తనకు లగడపాటి పంపిన సర్వే రిపోర్ట్‌ను స్క్రీన్ షాట్‌గా తీసి ట్విట్టర్‌లో పెట్టారు.

ktr-lagadapati-whatsapp-cha

దీనిపై లగడపాటి రాజగోపాల్ అసలేం జరిగిందో వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు. సెప్టెంబర్‌లో ఓ బంధువు ఇంట్లో కేటీఆర్ కలిశారని సర్వే గురించి అడిగారన్నారు. కేటీఆర్ కోరినందున తాను కలిశానన్నారు. దీన్తి రేవంత్ రెడ్డి ఆరోపించిన ప్రకారం ఇద్దరి మధ్య గత సెప్టెంబర్ నుంచి సర్వేల విషయంలో అనేక సార్లు భేటీలు, మాటలు జరిగాయని అర్థం చేసుకోవచ్చు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగనని, కేటీఆర్ అడగబట్టే సర్వే వివరాలను ఆయనకు మెయిల్ చేశానని చెప్పారు. ఆసమయంలో కేటీఆర్ సర్వే చేసి పెట్టమని అడిగారని తాను చేసి పెట్టానని రాజగోపాల్ తెలిపారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పాన్నారు. కేటీఆర్ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే వివరాలు అడిగారని వాటి గురించి చెప్పానన్నారు. మొత్తంగా కేటీఆర్ అడిగిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందన్న విషయాన్ని ఆయనకు వాట్సాప్‌లోనే రిపోర్ట్ పంపానన్నారు. ఆ వాట్సాప్ స్క్రీ న్ షాట్‌ను లగడపాటి మీడియాకు షేర్ చేశారు. ఎన్నికలకు పొత్తులతో వెళ్లాలని కేటీఆర్‌కు సూచించాను కానీ సింగిల్‌ గానే కొడతామని కేటీఆర్ చెప్పారని లగడపాటి చెప్పుకొచ్చారు. కేటీఆర్ స్క్రీన్ షాట్‌లో చూపించిన సర్వే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరాం.. విడివిడిగా ఉన్నప్పుడు చేసిననిని అందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని అప్పుడే చెప్పానన్నారు.

ktr-whatsapp-chat

అంతేకాదు, అప్పుడే టీఆర్ఎస్‌ అభ్యర్థుల పట్ల వ్యతిరేకత బాగా ఉందని చెప్పావని, వాళ్లను మార్చమని కూడా సలహా ఇచ్చానని పేర్కొన్నారు. దీనితో పాటు కేటీఆర్‌కు సంబంధించిన రెండు వాట్సాప్‌ నెంబర్లను సైతం ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ రెండు నంబర్ల ద్వారానే తాము చాటింగ్ చేసుకున్నామని తెలిపిన ఆయన ఈ వ్యవహారం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. కాంగ్రెస్సే గెలుస్తుంది నవంబర్ 11వ తేదీన మెసెజ్ పెట్టానని కేటీఆర్ దాన్ని మాత్రం ట్వీట్‌లో పెట్టలేదన్నారు. చేదు నిజం చెప్పాను కాబట్టే కేటీఆర్ కు నచ్చలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ అనవసరంగా కెలుక్కున్నాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.