కవచం పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు…!

Bellamkonda Srinivas Kavacham Release On December 7th

జయ జానకి నాయక చిత్రం తరువాత బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న చిత్రం కవచం. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ మామిళ్ళ రూపొందిస్తున్నాడు. ఇటివల విడుదలైన టిజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం మొదట డిసెంబర్ 7 న విడుదల చేస్తాం అని ప్రకటించింది. అదే రోజు తెలంగాణా లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండటంతో సినిమా వసూళ్ళ పైన ప్రభావం చూపిస్తుంది అని భావించి వాయిదా వేద్దాం అనుకున్నారు. ఈ చిత్రం నిర్మించిన నిర్మాతలు కూడా ఏమి మాట్లాడకపోవడంతో కవచం మూవీ వాయిదా పడినట్లే అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిత్ర నిర్మాతలు ఈ చిత్రం విడుదలపైన క్లారిటీ ఇచ్చారు.

kavacham

అనుకున్నా సమయానికే అంటే డిసెంబర్ 7 న విడుదల చేస్తాం అని ప్రకటించింది. త్వరలోనే కవచం చిత్రం యొక్క ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తాం అని చెప్పింది. కవచం చిత్రంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సరసన మేహ్రిన్, కాజల్ అగర్వాల్ కథానాయకలుగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్, హర్షవర్ధన్ రాణే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ పోలీస్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.