ఆ తమిళ తంబీకి నాని ఒకే చెప్పాడట…!

Anil Ravipudi Movie Fix With Nani

నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్. ఆ చిత్రం పరాజయం పాలవడంతో నాని ఇక లాభం లేదు సింగల్ గానే హిట్ట్ కొట్టాలి అని గట్టి పట్టుదలతో ఉన్నాడు. నాని ప్రస్తుతం జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాని ఈ చిత్రంలో ఓ క్రికెట్ ప్లేయర్ గా నటిస్తున్నాడు. ఈ నేపధ్యం లోనే నాని మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యువ దర్శకుడు విక్రం కె కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో పట్టాలు ఎక్కల్సింది కానీ నానికి ఉన్న కమిట్ వలన ఈ చిత్రం లేట్ అవ్వుతూ వచ్చింది.

nani-vikram-kumar

విక్రం కుమార్ కూడా స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ తో సినిమా కోసం వెయిట్ చేశాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ చిత్రం పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు నాని కి ఉన్న కమిట్ మెంట్స్ పూర్తికావడంతో, నాని ఓకే చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురుంచి త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే నాని నటించినా రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ రెండు చిత్రాల విజయాలపైన నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. విక్రంతో నాని సినిమా పూర్తైన తరువాత అల్లు అర్జున్ తో సినిమాను పట్టాలు ఎక్కిన్చనున్నాడు. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు