రేపు సుదర్శన్ థియేటర్ కి “జెర్సీ” టీమ్..ఎందుకో తెలుసా …!

"Jersey" team to Sudarshan Theater tomorrow.. Do you know why...!

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. ఈ మూవీ 2019 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని , అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నది . బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టడం జరిగింది. ఈ మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేశారు. అయితే టీమ్ జెర్సీ ఆడియెన్స్ ని కలిసేందుకు రెడీ అయిపోయింది.

సుదర్శన్ 35ఎంఎం ధియేటర్ లో రేపు సాయంత్రం 6:00 గంటల జెర్సీ షో కి హీరో నాని, డైరెక్టర్ గౌతం తిన్ననూరి తో పాటుగా, ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా హాజరు కానున్నారు. జెర్సీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో సెలబ్రేట్ చేసుకోడానికి వస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించగా, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించడం జరిగింది.